SRIVARI SEVAKULU SHOULD PARTICIPATE IN TTD DHARMIC ACTIVITIES- TTD ADDL. EO _ క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాల్లో శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 23 Feb. 21: While appreciating the devoted services of Srivari Sevakulu, TTD Additional Sri AV Dharma Reddy called upon them to participate in TTD dharmic activities in their respective home turfs and extend their services as Custodians of Santana Dharma (Seva Dal).

Addressing the Srivari Sevakulu at Srivari Seva Sadan on Tuesday he said TTD aimed to utilise the services of Srivari Sevakulu in all its programs for promoting Sanatana Hindu dharma across the country by taking up unique programmes live Srinivasa Kalyanams, Kalyanamastu mass marriages for poor couple etc.

He was in all praise for Srivari Sevakulu who had rendered dedicated service during Ratha Sapthami at Tirumala held during last week, spiritual programs at organised by TTD at Kurnool, Visakhapatnam and Nellore etc.  

Referring to legends and Puranas, he spoke highly of Srivari Sevakulu as favourites of Lord Venkateswara and the lord always likes those who serve His bhaktas. He said Srivari Seva is a blessing for them to serve devotees for a week’s time at Tirumala.

He urged them to spread information about facilities and their experiences at Tirumala in their regions and inspire more youth and devotees to enlist as Srivari Sevakulu.

TTD SE-2 Sri Nageswara Rao, EEs Sri Subramaniam, Sri Mallikarjuna Prasad, Sri Jaganmohan Reddy, DE (Electrical) Smt Saraswati, AEO Srivari Seva Sri Ramakanth Rao and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాల్లో శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2021 ఫిబ్ర‌వ‌రి 23: టిటిడి త్వ‌ర‌లో నిర్వ‌హించనున్న క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాలు లాంటి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఆయా ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కులు త‌మవంతు స‌హ‌కారం అందించి సేవ‌లందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న శ్రీ‌వారి సేవ‌కుల‌తో మాట్లాడారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం నాడు విశేషంగా సేవ‌లందించార‌ని అభినందించారు.

అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి మ‌హాయ‌జ్ఞంలా త‌ల‌పెట్టిన అనేక హైంద‌వ ధార్మిక కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌న్న సంక‌ల్పంతో ఉంద‌న్నారు. ఇటీవ‌ల క‌ర్నూలులో ధ‌నుర్మాస ల‌క్ష్మీ దీపారాధ‌న‌, వైజాగ్‌లో కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం, నెల్లూరులో వ‌సంత పంచ‌మి స‌ర‌స్వ‌తి పూజ, తిరుమ‌ల‌లో జ‌రిగిన ర‌థ‌స‌ప్త‌మి కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కులు విశేషంగా సేవలందించార‌ని కొనియాడారు. స్వామివారికి భ‌క్తులంటే ఎన‌లేని ప్రేమ అని, పురాణాల్లోని ప్ర‌హ్లాద‌చ‌రిత్ర‌, గ‌జేంద్ర‌మోక్షం ఘ‌ట్టాలు దీన్ని నిరూపిస్తున్నాయ‌ని చెప్పారు.  ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో వారం రోజుల పాటు బ‌స చేసి స్వామివారికి ప్రియ‌మైన భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల పూర్వ‌జ‌న్మ పుణ్య‌ఫ‌లమ‌న్నారు. సేవ‌కులు త‌మ ప్రాంతాలకు వెళ్లి ఇక్క‌డి అనుభ‌వాలు, వ‌స‌తుల‌ను తెలియ‌జేసి మ‌రింత మంది శ్రీ‌వారి సేవ‌కు వ‌చ్చేలా కృషి చేయాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఇఇలు శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్‌‌, శ్రీ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి, ఏఈవో శ్రీ ర‌మాకాంత‌రావు ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.