SRIVARU VISITS VIKHANASA MUNI SANNIDHI _ శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

TIRUMALA, 24 AUGUST 2021: Sri Malayappa Swamy visited Vikhanasa Maharshi Sannidhi located on North Mada Street in Tirumala along with Sridevi and Bhudevi on Monday evening after Sahasra Deepalankara Seva.

Vikhanasa Maharshi Jayanthi was held on the day of Shravana Pournami on Sunday. The next day, Srivaru graced the Sannidhi of his ardent bhakta and received the honours of Talige (Prasadam) and Harati and returned to Tirumala temple.

Vikhanasa Maharshi Trust Secretary Sri Prabhakaracharyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమ‌ల‌, 2021 ఆగస్టు 23: శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సోమవారం ఉత్త‌ర మాడ వీధిలో గ‌ల శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో వైఖాన‌స ఆగ‌మం ప్ర‌కారం నిత్య‌కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రాన్ని శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి ర‌చించారు.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ విఖ‌న‌స మహర్షి ట్రస్టు సెక్రెటరీ శ్రీ ప్రభాకర్ ఆచార్యులు, ఇత‌ర‌ ఆల‌యాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.