WIDE PUBLICITY CAMPAIGN ACTIVITY BY TTD ON SARVA DARSHAN TOKEN SYSTEM _ సర్వదర్శనం టోకెన్లపై విస్తృత ప్రచారం కరపత్రాలు, ఫ్లెక్సీలు, మైక్‌ల ద్వారా అవగాహనభక్తుల నుండి విశేష స్పందన

Tirupati, 12 May 2018: TTD has taken up wide publicity campaign activity on the Sarva Darshan Token system which aims at providing easy darshan to pilgrims minimizing their long waiting hours in queue lines and compartments.

10 LAKH PAMPHLETS IN VARIOUS LANGUAGES

To inform wider range of pilgrims who are coming for darshan of Lord Venkateswara, TTD has published 10 lakh pamphlets and handouts in Telugu, Tamil, Kannada, Hindi and English. Apart from this flex boards have also been displayed at various vital areas in Tirumala and Tirupati.

PUBLICITY WITH SEVAKULU

Every day over 100 Srivari Sevakulu are exclusively deployed to take up publicity campaign in Tirupati and Tirumala. They are being provided with megaphones and mike sets to announce about the Sarva Darshan Token system in a continuous manner. The publicity campaign is rigorously taken up at Bhudevi Complex near Alipiri, Railway Station, Bus Station, II and III NC chowltries, Vishnunivasam and Srinivasam where the Sarva Darshan Token issuing counters are located.

EVEN AT RENIGUNTA

Similar publicity campaign is also been taken up at Renigunta Railway station. The Sevakulu are distributing pamphlets in all the trains reaching Tirupati. In Tirumala, the publicity campaign is taken up at RTC bus stand, ATC circle, near MBC 26 and 34, in SD complex also informing the pilgrims to take Sarva Darshan tokens in the counters located at these places.

THROUGH SOCIAL MEDIA

The IT wing of TTD has also kept the detail information on Sarva Darshan token system in its official website. While some media channels and Sevakulu have voluntarily taking up the publicity campaign through Whatsapp, Twitter, Facebook reaching global pilgrims.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వదర్శనం టోకెన్లపై విస్తృత ప్రచారం కరపత్రాలు, ఫ్లెక్సీలు, మైక్‌ల ద్వారా అవగాహనభక్తుల నుండి విశేష స్పందన

మే 12, తిరుపతి, 2018: భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రవేశపెట్టిన సర్వదర్శన విధానంపై టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 10 లక్షల కరపత్రాలను టిటిడి ముద్రించింది. కరపత్రాలతోపాటు ఫ్లెక్సీలు, పోస్టర్లను రూపొందించి భక్తులకు అవగాహన కల్పిస్తోంది. మొబైల్‌ మైక్‌సెట్‌తో తిరుపతిలోని టోకెన్‌ జారీ కౌంటర్ల వద్ద ప్రచారం చేస్తున్నారు. మెగాఫోన్‌ల ద్వారా శ్రీవారి సేవకులు ఈ విధానం గురించి భక్తులకు తెలియజేస్తున్నారు. భక్తులు విశేషంగా స్పందించి సర్వదర్శనం టోకెన్లు పొందుతున్నారు.

తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయాలు, రైల్వేస్టేషన్‌ వెనుకవైపు గల చౌల్ట్రీలు, ఆర్‌టిసి బస్టాండు, అలిపిరి బస్టాండ్‌ వద్దగల భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్‌ జారీ కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ శ్రీవారి సేవకులు మెగాఫోన్‌ ద్వారా ప్రకటించడంతో పాటు వివిధ భాషల్లోని కరపత్రాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు తగిన సూచనలిచ్చి టోకెన్లు పొందేలా చూస్తున్నారు. తిరుపతిలోని రైల్వేస్టేషన్‌లో ప్రవేశద్వారం, నిష్క్రమణ ద్వారం, ప్లాట్‌ఫారంపై ఉన్నవారితోపాటు అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాలు అందిస్తున్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు, తిరిగి రేణిగుంట నుండి తిరుపతి వరకు అన్ని రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాల ద్వారా సమాచారం తెలియజేస్తున్నారు. రేణిగుంట నుంచి చెన్నై వెళ్లే రైళ్లలోని ప్రయాణికులకు కూడా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్‌లో మెగాఫోన్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఆర్‌టిసి బస్టాండులోనూ అన్ని ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు కరపత్రాలు, మెగాఫోన్‌ ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో దిగిన భక్తులు విష్ణునివాసంలోని కౌంటర్లలో, బస్టాండులో దిగిన ప్రయాణికులు అక్కడేవున్న కౌంటర్లలో టోకెన్లు పొందేలా శ్రీవారి సేవకులు సూచనలిస్తున్నారు. శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, రైల్వేస్టేషన్‌ వెనుకవైపు గల చౌల్ట్రీలు, అలిపిరి బస్టాండ్‌ వద్దగల భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల వద్ద కూడా ఇదేవిధంగా ప్రచారం జరుగుతోంది. టిటిడి ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్స్‌ బ్యానర్లు ఏర్పాటుచేశారు. నగరవాసులు, యాత్రికులు వీటి ద్వారా టోకెన కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకుంటున్నారు. చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాలకు కరపత్రాలు పంపి అక్కడి భక్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతిలో ఒక రోజుకు రెండు షిఫ్టుల్లో దాదాపు 200 మంది శ్రీవారి సేవకులు ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

తిరుమలలో ఒక రోజుకు రెండు షిఫ్టుల్లో 50 మంది శ్రీవారి సేవకులు మెగాఫోన్‌ల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండ్‌, కౌస్తుభం, సిఆర్‌వో, ఎంబిసి, నందకం ప్రాంతాల్లో గల కౌంటర్ల వద్ద ప్రకటనలిస్తున్నారు. అదేవిధంగా, శ్రీవారిమెట్టు మార్గం నుండి తిరుమలకు చేరుకునే ప్రదేశం, ఎటిసి సర్కిల్‌, నారాయణగిరి ఉద్యానవనాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శనం భక్తులకు తగిన సూచనలిస్తున్నారు. అదేవిధంగా, టిటిడి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు జారీచేసి పత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల సహకారంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సర్వదర్శనం టోకెన్లపై నెటిజన్లకు అవగాహన కల్పించేందుకు ఐటి విభాగం టిటిడి వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.