STAFFS, VOLUNTEERS AND GUIDES WILL BE TRAINED IN SOFT SKILLS-TTD EO
Tirumala, 7 Jun. 19: The Srivari Seva Volunteers will be given training on soft communication skills and dealing with the pilgrims in a smooth manner, said, TTD EO Sri Anil Kumar Singhal.
Answering a pilgrim caller Sri Muralidhar from Rajahmundry who brought to the notice of EO about the rough handling of the volunteers inside the sanctum, the EO said, the volunteers will be imparted training on how to deal with the pilgrims. “Already we are giving training to our employees, volunteers, scouts and guides on soft skills. But still, we are receiving complaints on rough handling. We will enhance our training and orientation programme to the volunteers and guides, he added.
The EO answered 19 callers as a part of the monthly Dial your EO programme which was held on Friday at Annamaiah Bhavan in Tirumala.
Callers Sri Venkatakrishna from Nellore, Sri Sai from Hyderabad, Sri Nagaraju from Mysore sought the EO to simplify the advance room booking in online from the existing 120 days to 60 days or a month to which EO replied them that out of 6000 odd rooms available in Tirumala, only 2000 rooms were kept in online advance booking quota while the remaining rooms can be booked in current booking. “The decision was taken only after considering the majority of requests from the pilgrims into consideration as we are releasing arjitha seva quota in online three months before”, he added.
Another pilgrim caller Sri Prasad from Dwaraka Tirumala sought EO to clear the wine shop and meat stall located in front of TTD choultry in Dwaraka Tirumala. Reacting to this the EO said though TTD has no direct role to intervene, he will definitely negotiate with the concerned authorities to sort out the issue.
A pilgrim Sri B Ramakrishna suggested the EO to arrange breakfast to the pilgrims like meals, for which the EO said already TTD is serving breakfast from 9.30am till 11am in Annaprasadam complex.
Callers Sri Ramu from Anantapur, Smt Padmavathi from Kavali, Smt Shravya from Hyderabad, Sri Srinivasa Murthy from Bengaluru sought EO to revise the online dip system for Arjitha Seva tickets as they are not getting the sevas in spite of trying for over a year. Replying them EO said, for 10thousand odd tickets online, over 1.20lakh pilgrims are trying every month. Finally, 5thousand plus (two members of a family) are getting the tickets. In this, some may get in their first attempt while some others after their 10th or 11th attempt. In this case, we cannot increase the number of persons which we can allot tickets to a family since that may still hamper the figures”, he added.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్‌లైన్‌లో 70,918 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్ యువర్ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల, 2019 జూన్ 07: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన సెప్టెంబరు నెల కోటాలో మొత్తం 70,918 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,618 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,898, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 60,300 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జిత బ్రహ్మూెత్సవం 7,975, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయని వివరించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. వేంకటేశ్వర్లు – ఖమ్మం.
ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగులకు టిటిడి కల్పించే ప్రత్యేక దర్శన టోకెన్లను ఉదయం, సాయంత్రం ఇస్తే సౌకర్యవంతంగా ఉంటుంది ?
ఈవో : భక్తుల కోరిక మేరకు ఉదయం ఒకేసారి 1400 టోకెన్లు ఒకేసారి జారీ చేస్తున్నాం. తద్వారా భక్తులు వారికి కేటాయించిన సమయంలో వేచివుండి దర్శనం చేసుకుంటున్నారు.
2. ప్రసాద్ – ద్వారకా తిరుమల
ప్రశ్న: ద్వారకా తిరుమలలోని టిటిడి కల్యాణ మండపం ఎదురుగా మద్యం, మాంసం దుకాణాలు ఉన్నాయి. వాటిని అక్కడినుండి తొలగిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది ?
ఈవో : ఈ విషయాన్నట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లతాం.
3. రామకృష్ణ –
ప్రశ్న: తిరుమలలో ప్రైవేట్ హోటల్‌వారు టిఫిన్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కావున టిటిడి వారు టిఫిన్‌లను ఉచితంగా అందిస్తే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది?
ఈవో : భక్తుల సౌకర్యార్థం టిటిడి ఇప్పటికే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనంలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు పొంగలి, ఉప్మా తదితర టిఫిన్లు అందిస్తున్నాం.
4. వెంకటకృష్ణ – నెల్లూరు, సాయి – హైదరాబాదు, నాగరాజు – మైసూరు, శ్రీనివాసమూర్తి – బెంగుళూరు,
ప్రశ్న: తిరుమలలో ముందస్తుగా గదులు పొందేందుకు 90 రోజుల గడువుతో విడుదల చేస్తున్నారు. దీనిని 30 రోజుల ముందు విడుదల చేస్తే బావుంటుంది.?
ఈవో : భక్తుల కోరిక మేరకు రూ.300 – దర్శనం టికెట్లు, శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు పొందినవారి సౌకర్యార్థం 90 రోజుల ముందుగా విడుదల చేస్తున్నాం.
5. తిరుపతి – జ్ఞానప్రకాష్
ప్రశ్న: శ్రీవారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేస్తుంటారు కావున వారికి వారివారి బాషలలో సమాధానం తెలపడం ఉపయోగకరంగా ఉంటుంది?
ఈవో : భక్తులకు అర్థమయ్యేందుకు వీలుగా ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ బాషలలో సమాధానాలు చెబుతున్నారు. తిరుమలలో సూచిక బోర్డులు, సౌకర్యాలు, తదితర సమాచారాన్ని వివిధ బాషలలో అందిస్తున్నాం. అదేవిధంగా టిటిడి వెబ్‌సైట్, కాల్‌సెంటర్ ద్వారా 2, 3 బాషలలో సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తున్నాం.
6. రాము – అనంతపురం, పద్మావతి – కావలి,
ప్రశ్న: గతంలో శ్రీవారి ఆర్జిత సేవలను ఈ-దర్శన్ కౌంటర్లలో ఇచ్చేవారు, ప్రస్తుతం కూడా అదే పద్ధతిని అమలు చేయగలరు, చాలా సార్లు ప్రయత్నించినా డిప్ విధానంలో సేవలు లభించడం లేదు?
ఈవో : ఈ-దర్శన్ కౌంటర్లలో ఆర్జితసేవలు కేటాయింపుపై భక్తుల నుండి విరివిగా పిర్యాదులు రావడం వలన లక్కీడిప్ విధానం ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ప్రతి నెల 1.1 లక్షల మంది భక్తులు ఆర్జిత సేవలకు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. పారదర్శకంగా ఆర్జితసేవలను భక్తులకు కేటాయించేందుకు లక్కీడిప్ విధానం అమలుచేస్తున్నాం. అదేవిధంగా తిరుమలలో ప్రతి రోజు కరెంటు బుకింగ్‌లో ఆర్జిత సేవలకు రిజిష్టరు చేసుకున్నవారికి పారదర్శకంగా టికెట్లు పొందుతున్నారు.
7. శ్రావ్య – హైదరాబాదు
ప్రశ్న: కుటుంబ సభ్యులలో మరో ఇద్దరికి లక్కీడిప్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించండి?
ఈవో : లక్షలాది మంది భక్తులు ఆర్జితసేవలు పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మించి అవకాశం ఇవ్వడం వల్ల మిగిలిన భక్తులకు అవకాశం ఇవ్వలేము.
8. మురళి – రాజమండ్రి
ప్రశ్న: ఏప్రిల్ 23వ తేదీ రూ.300- ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చాం. బంగారు వాకిలి వద్ద వాలంటీర్లు తోసివేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం.?
ఈవో : బంగారువాకిలి చెంత శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మహిళసేవకుల ద్వారా తోపులాటలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
9. ప్రసాద్ – విశాఖపట్నం
ప్రశ్న: టిటిడి కల్యాణమండపాల ఖాళీ సమయాలలో నామమాత్రపు రుసుంతో టిటిడి ప్రచురణలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వగలరు?
ఈవో : టిటిడి కల్యాణమండపాలలో ఎలాంటి శుభకార్యలు లేని సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలు విక్రయించేందుకు అనుమతిస్తాం.
10. సత్యనారాయణ – విజయనగరం
ప్రశ్న: టిటిడి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో పిఏసిలో లాకర్స్, దుప్పటి, చాప పొందేందుకు 3 గంటలు వేచి ఉండవలసి వచ్చింది. సిబ్బంది కొరత వలన ఒకే వ్యక్తి భక్తులందరికి పంపిణీ చేయడం వల్ల అధిక సమయం పడుతుంది?
ఈవో : పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
11. రవీంద్ర – బెంగుళూరు
ప్రశ్న: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆధార్ కార్డు తప్పనిసరని అంటున్నారు. అధికారులు కూడా ఆధార్ కార్డు చూపించవలసిందిగా అడుగుతున్నారు.
ఈవో : దేశంలో అధిక శాతం మంది ప్రజలు గుర్తింపుకార్డుగా ఆధార్ కార్డును వినియోగిస్త్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అందరికి సౌకర్యంగా ఉండేలా ఆధార్ కార్డును అధికారులు అడిగి ఉండవచ్చు, ఆధార్‌కార్డు లేని పక్షంలో ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చు.
12. నాయుడు – విజయనగరం
ప్రశ్న: కల్యాణకట్టలో క్షురకులు డబ్బులు అడుగుతున్నారు?
ఈవో : కల్యాణకట్టలో నిఘాను మరింత పెంచి, పిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటాం.
13. హరినాధ్ – హైదరాబాదు
ప్రశ్న: దాతల దర్శనం కోటాను దశలవారిగా కుదిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజులలో శుపథం ద్వారా దర్శనం కల్పించండి?
ఈవో : భక్తుల రద్దీ నేపథ్యంలో వారి సౌకర్యార్థం నిర్ణీత రోజులలో దాతలకు దర్శనం కల్పిస్తాం. అధిక రద్దీ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనాలను రద్దు చేస్తున్నాం. దాతలకు శుపథం ద్వారా దర్శనానికి పంపించే అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.