STATE-WIDE KALYANAMSTU ON AUGUST 7-TTD EO _ జులై 1 నుంచి క‌ల్యాణ‌మ‌స్తుకు న‌మోదు చేసుకోవాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

KALYANAMASTU MUHURAT CARD PLACED AT THE HOLY FEET OF SRIVARU

 COMMENCEMENT OF REGISTRATION FROM JULY 1 ONWARDS

TIRUMALA, 17 JUNE 2022: The unique free mass marriages programme, Kalyanamastu is scheduled to take place in all the 26 District Head Quarters across the state of AP on August 7 in the auspicious hour between 8.07am and 8.17am, said TTD EO Sri AV Dharma Reddy.

On Friday, the Kalyanamastu Muhurta Patrika was taken on a procession to Srivari temple from Bedi Anjaneya Swamy temple in Tirumala. The Muhurta Patrika was placed at the holy feet of Sri Venkateswara Swamy to receive His divine blessings and special puja was performed.

Speaking to the media on the occasion, the EO said, TTD has resumed this noble programme after a decade. So this prestigious programme will be observed initially at the entire district HQs across Andhra Pradesh on August 7. With the blessings of Srivaru, the poor parents who could not afford to perform the marriages of their children can now execute without any financial burden. Those who are willing to enter the nuptial knot shall have to register which opens from July 1 onwards”, he added.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, DyEO Srivari Temple Sri Ramesh Babu, All Projects Program Officer Sri Vijayasaradhi, Agama Advisor Dr Vedantam Vishnubhattacharyulu, VGO Sri Bali Reddy, AEO HDPP Sri Satyanarayana, Parupattedar Sri Tulasi Prasad and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జులై 1 నుంచి క‌ల్యాణ‌మ‌స్తుకు న‌మోదు చేసుకోవాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

– ముహూర్త ప‌త్రిక‌ను శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక‌పూజ‌లు

తిరుమల, 2022 జూన్ 17: రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నామ‌ని, ఇందుకోసం జులై 1వ తేదీ నుంచి న‌మోదు చేసుకోవాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. కల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మ ముహూర్త ప‌త్రిక‌ను శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో పూజ‌లు చేప‌ట్టారు. అక్క‌డి నుంచి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ‌ ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు.

శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మానికి ఆగ‌స్టు 7న ఉదయం 8 గం.07 నిమిషాల నుండి 8 గం. 17 నిమిషాల మధ్య పండితులు సుముహూర్తం నిర్ణయించిన‌ట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజ‌నం వ‌డ్డించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మానికి న‌మోదు చేసుకుని శ్రీవారి ఆశీస్సులతో వివాహాలు చేసుకోవాల‌ని కోరారు. ప‌దేళ్ల త‌రువాత క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభించామ‌ని, మొద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించి ఆ త‌రువాత ఇత‌ర రాష్ట్రాల్లో చేప‌డ‌తామ‌ని చెప్పారు.

అనంత‌రం ముహూర్త ప‌త్రికను సిద్ధం చేసిన టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యుల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో శాలువ‌తో స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవోలు శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, ఏఈవో శ్రీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.