SUB COMMITTEES FORMED_ టిటిడి ధర్మకర్తల మండలి సబ్‌ కమిటీలు ఏర్పాటు

Tirumala, 5 June 2018: To enhance the quality of service to Pilgrims, 11 sub committees have been formed by the TTD board on Tuesday.

The sub-committees includes BIRRD, SVIMS, FMS, Kalyana Mandapams Maintenance, Cottages, Donor Privileges, Marketing, Engineering, Investment, HDPP, New Delhi.

Certain privileges which are being extended to the donors donating foreign currenies to TTD corpus or Hundi, similar privileges will be extended to the donors who will be donating Foreign currency to TTD Trusts.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సబ్‌ కమిటీలు ఏర్పాటు

జూన్‌ 05, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశం జరిగింది. ఇందులో 11 సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో కొనుగోళ్లు, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌, హిందూ ధర్మప్రచార పరిషత్‌, బర్డ్‌ ఆసుపత్రి, స్విమ్స్‌, పెట్టుబడులు, న్యూఢిల్లీ , కల్యాణమండపాల నిర్వహణ, ఎఫ్‌ఎంఎస్‌, కాటేజి డోనేషన్‌ స్కీమ్‌పై కమిటీలు ఉన్నాయి.

అదేవిధంగా, టిటిడి ట్రస్టులకు భక్తుల నుండి విదేశీ కరెన్సీని కూడా విరాళంగా స్వీకరించేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఫారిన్‌ కరెన్సీ రిజిస్ట్రేషన్‌ అథారిటీ(ఎఫ్‌సిఆర్‌ఏ) నిబంధనలను పాటిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశీ కరెన్సీని విరాళంగా ఇచ్చేవారికి, దాతలకు కల్పించే సదుపాయాలన్నింటినీ టిటిడి వర్తింపచేస్తుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.