SUBHAKRUT CELEBRATIONS PEAK IN MAHATI _ శుభకృత్ నామ సంవత్సరంలో సకల శుభాలు : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం 

TIRUPATI, 02 APRIL 2022: Sri Subhakrutnama Ugadi festivities was observed with utmost gaiety and enthusiasm jointly by the HDPP and Welfare wings of TTD in Mahati Auditorium on Saturday.

TTD JEO Sri Veerabrahmam who attend the programme as Chief Guest speaking on the occasion said, like in the name let everything go in a hassle-free manner in this auspicious year with the blessings of Sri Padmavathi Srinivasa. Later TTD Agama Advisor Dr Vedantam Vishnubhattacharya rendered Panchanga Shravanam giving the celestial equations and incidence probabilities across the nation as well in the world in Subhakrutnama Samvatsara.

Later the fancy dress competition to the kids of employees in mythological and traditional characters has been portrayed followed by the distribution of prizes in quiz, poetry competitions held for the employees for Ugadi.

All Hindu Projects Programme Officer Sri L Vijaya Saradhi, Welfare Officer Sri Damodaram and SV College of Music and Dance Principal Sri Tirupati M Sudhakar and other officers and employees were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శుభకృత్ నామ సంవత్సరంలో సకల శుభాలు : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం 
 
మహతిలో ఘనంగా ఉగాది ఉత్సవం
 
తిరుపతి, 2022   ఏప్రిల్‌  02: శ్రీవారి ఆశీస్సులతో శుభకృత్ నామ సంవత్సరంలో సకల శుభాలు కలుగుతాయని పంచాంగం ద్వారా తెలుస్తోందని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం పేర్కొన్నారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ శుభకృత్ నామ సంవత్సరంలో భక్తులందరికీ శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉగాది రోజున ఉగాది పచ్చడి సేవనంతో పాటు పంచాంగ శ్రవణం చేసి రాశిఫలాల ద్వారా భవిష్యత్తులో జరిగే మంచి చెడులను తెలుసుకుని తదనుగుణంగా ఆచరించడం ప్రధానమైన అంశమని అన్నారు.
 
ఈ సందర్భంగా టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య వేదాంతం శ్రీ‌విష్ణుభ‌ట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. తెలుగు సంవత్సరాల్లో శ్రీ శుభకృత్ 36వదని, ఈ  సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, సమస్త ధాన్యరాశులతోపాటు పాడిపంటలు వృద్ధి చెందుతాయని అన్నారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో జెఈవో సన్మానించారు. 
 
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. ఆ తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. 
 
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలకు సంప్రదాయ వేషధారణ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఆ తరువాత ఉగాది సందర్భంగా టిటిడి ఉద్యోగులకు నిర్వహించిన స్వీయ కవిత, పద్యపఠనం, ఉగాది పాటలు, క్విజ్‌  పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, ఏఈఓలు శ్రీ సత్యనారాయణ, శ్రీ శ్రీరాములు, ఇతర అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.