SUBRAHMANYA SWAMY HOMAM HELD AT KAPILATHIRTHAM _ కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం 

Tirupati, 18 January 2023: As part of ongoing Homams at Sri Kapileswara Swamy temple, Sri Subrahmanya Swamy Homam was performed on Wednesday.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Temple Archakas and officials were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుప‌తి, 2023 జనవరి 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, సుబ్రహ్మణ్యస్వామి వారి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.

జనవరి 19వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి హోమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.