SUBRAMANYA SWAMI HOMAM COMMENCES _ కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
Tirupati, 01 Nov 19 : As a part of week long Karthika Homa Mahotsavams, Subramanya Homam commenced in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.
In Yagashala, Laghupurnahuti, Nivedana, Harati were performed in the morning followed by Sahasranamarchana, Visesha Deeparadhana in the evening.
The Subramanya Homam will be observed for three days which will conclude on November 3. On Saturday, November 2, Sri Valli Sri Devasena Sametha Sri Subramanya Swamy kalyanam will be performed in the evening between 6pm and 8pm. The Grihasta pilgrims can take part in this Homam on payment of Rs. 500 per ticket on which two persons will be allowed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
తిరుపతి, 2019 నవంబరు 01 ; తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
కాగా శనివారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.