SUBRAMANYA SWAMY HOMAM COMMENCES _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

TIRUPATI, 08 November 2021: As part of month-long Mahotsavams in Sri Kapileswara Swamy temple, Subramanya Swamy Homam commenced on Monday.

The same will be continued even on Tuesday. Morning Puja, Homam, Laghu Purnahuti, Nivedana Harati were performed to the deities of Srivalli Devasena Sameta Sri Subramanya Swamy on Monday.

Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati and others were also present in this Karthika Masa Homam held in Ekantam due to Covid norms.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉద‌యం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హించ‌నున్నారు.

కాగా మంగ‌ళ‌వారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.