SUNDARA RAJA AVATAROTSAVAMS CONCLUDES IN TIRUCHANOOR _ గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం ముగిసిన అవతార మహోత్సవాలు
Tiruchanur, 5 July 2018: The three day annual religious event of Avatarotsavams concluded on a celestial note in Sri Sundara Raja Swamy temple, a sub-shrine of Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Thursday.
After awakening the deity with Suprabhata Seva, Snapana Tirumanjanam has been performed in Mukha Mandapam.
Later in the evening the Lord seated atop Garuda Vahanam majestically, took ride along the four mada streets blessing the devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం ముగిసిన అవతార మహోత్సవాలు
తిరుపతి, 05 జూలై 2018 ; తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం స్వామివారు గరుడవాహనంపై భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది.
అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.