SUNDARA TIRUMALA-SUDDHA TIRUMALA MISSION REACHES TENTH DAY _ పదో రోజుకు చేరిన “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” యజ్ఞం

TIRUMALA, 09 MAY 2023: Sundara Tirumala-Suddha Tirumala, the mass cleaning mission with the voluntary participation of employees of TTD which commenced on April 30 has successfully completed the tenth day in a row on Tuesday.

 

Addressing the TTD employees and Srivari Seva volunteers in Asthana Mandapam, TTD EO Sri AV Dharma Reddy complimented the strong workforce for taking forward the mission with commitment. “Whenever a situation of crisis arises, all the employees should unite without compromising when it comes to the services of pilgrims and reputation of the institution”, he added.

 

He also poured in laurels on Srivari Seva volunteers who have extended their solidarity and took part in the Mass Cleaning Mission with elan.

 

In the last ten days about 5000 employees from various departments belonging to Tirupati and Tirumala including officials to sub-ordinate staff have been deputed and over 2000 Srivari Sevaks have offered services in Sundara Tirumala-Suddha Tirumala.

 

Health Officer Dr Sridevi, Chief Audit Officer Sri Sesha Sailendra, Assistant PRO Ms Neelima were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పదో రోజుకు చేరిన “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” యజ్ఞం
 
మే 09, తిరుమల, 2023: టిటిడి ఉద్యోగులు స్వచ్ఛందంగా చేపడుతున్న “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” యజ్ఞం మంగళవారం 10వ రోజుకు చేరుకుంది.
 
ఈ సందర్భంగా తిరుమల ఆస్థాన మండపంలో ఉద్యోగులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించిన విపత్కర సమయంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తిరుమలను పరిశుభ్రంగా ఉంచుకోవడం హర్షణీయమన్నారు. హోదాతో సంబంధం లేకుండా అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కొనియాడారు. ఉద్యోగులకు తోడుగా శ్రీవారి సేవకులు కూడా ముందుకొచ్చి చక్కగా పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని చెప్పారు.  ఉద్యోగులు చేస్తున్న పారిశుద్ధ్య పనులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు చేయడం వల్ల ఇతర ఆధ్యాత్మిక సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తామన్నారు.
 
కాగా, ఇప్పటివరకు పది రోజుల్లో దాదాపు 5000 మంది ఉద్యోగులు, సుమారు 2000 మంది శ్రీవారి సేవకులు పారిశుద్ధ్య విధుల్లో స్వచ్చందంగా పాల్గొన్నారు. 
 
 
 ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.