SUNDARARAJA ON HANUMANTHA _ హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

TIRUPATI, 21 JUNE 2022: Sri Sundararaja Swamy on the second day evening on Tuesday blessed His devotees on Hanumantha Vahanam.

As a part of the ongoing annual Avatarotsavams of Sri Sundararaja Swamy temple in Tiruchanoor, Abhishekam was performed in the morning.

DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

తిరుపతి, 2022 జూన్ 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంత‌రం మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది.

అనంతరం వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా బుధ‌వారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.