SUNDARARAJA SWAMY ANNUAL UTSAVAMS COMMENCES _ శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు ప్రారంభం
Tiruchanoor, 29 Jun. 21: The annual Avatarotsavams of Sri Sundararaja Swamy at Tiruchanoor commenced on Tuesday.
Snapana Tirumanjanam to Sridevi, Bhudevi sameta Sri Sundararajaswamy was performed between 2:30pm and 4pm followed by Unjal Seva between 6pm and 7pm.
Superintendent Sri Seshagiri and others were also present in this utsavam held in Ekantam in view of Covid.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 జూన్ 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఇందులోభాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.