SUNDERARAJASWAMY UTSAVAMS CONCLUDES_ ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

Tiruchanoor, 15 July 2017: The annual avatarotsavams of Sri Sunderarajaswamy concluded on a religious note in Tiruchanoor on Saturday evening.

Snapana tirumanjanam was performed to the deities in the morning in Sri Krishnaswamy Mukha Mandapam. Later Unjal Seva was performed.

In the night the Lord was taken on a celestial procession on Garuda Vahanam.
This annual fete is usually observed for three days every year with the final day coinciding with the advent of Satabhisha nakshatra since the Lord emerged in Tiruchanoor on this day some hundreds of years ago.

Temple Spl Gr DyEO Sri Munirathnam Reddy, AEO Sri Radhakrishna, Suptd Sri Ravi and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

గరుడ వాహనంపై స్వామివారి దర్శనం

తిరుపతి, 2017, జూలై 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీసుందరరాజస్వామివారికి వేడుకగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీపద్మావతి అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవ రద్దయింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీరాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.