SUPERNATURAL SCIENCE COURSE STARTS IN SVVU _ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అధీంద్రియ విజ్ఞానం కోర్సు ప్రారంభం

TIRUPATI, 12 SEPTEMBER 2023: TTD-run Sri Venkateswara Vedic University inaugurated the Certificate Course in Psychiatry under the Chairmanship of Vice Chancellor Acharya Rani Sadasivamurthy on Monday.

TTD EO Sri AV Dharma Reddy was the chief guest for this program and Sri Sankaranandagiri Swami, the organizer of Kriya Yoga Center of Rushikesh, was the special guest for the event.

Speaking on the occasion the EO said that there are ways to solve many problems of the people of the world through the Kriya Yoga path of Sanatana Dharma and transcendental science.  He said by practicing them in our daily life, we can overcome our mental problems also.

Later, Vice-Chancellor Sri Rani Sadasivamurthy said that a certificate course called Adhindriya Vigyanamu is being introduced in Vedic University to find solutions to human problems. 

It was informed through PowerPoint presentation that through this course one can develop knowledge and retention. 

Later, Sri Swami Sankaranandagiri said that this path of yoga in the most ancient solutions taught by Sanatana Dharma. It is said that it includes Kriya yoga, Gnana yoga and Pranayama.  This path of yoga is very necessary for today’s society to lead a stable and able life”, he asserted.

University Registrar Mr. Radheshyam, Deans Subramanya Sharma, Mr. Phaniyajulu, faculty, staff and students participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అధీంద్రియ విజ్ఞానం కోర్సు ప్రారంభం

తిరుపతి‌, 11సెప్టెంబ‌రు 2023: టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అధీంద్రియవిజ్ఞానము సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభోత్సవం సోమవారం ఉప కులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈవి శ్రీ ఏ.వి ధర్మారెడ్డి, ప్రత్యేక అతిథిగా రుషీకేశ్ కు చెందిన క్రియా యోగ కేంద్ర నిర్వాహకులు శ్రీశంకరానందగిరి స్వామి పాల్గొన్నారు.

ముందుగా ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవుల అనేక సమస్యలకు సనాతన ధర్మంలోని క్రియాయోగ మార్గం, అధీంద్రీయ విజ్ఞానం ద్వారా పరిష్కార మార్గాలు ఉన్నాయన్నారు. వాటిని మనం నిత్యజీవితంలో ఆచరించడం ద్వారా మానసిక సమస్యల నుంచి బయటపడతామని తెలిపారు.

అనంతరం ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి మాట్లాడుతూ మానవ సమస్యలకు పరిష్కారం చూపేందుకు వేద విశ్వవిద్యాలయంలో అధీంద్రియ విజ్ఞానము అనే సర్టిఫికెట్ కోర్స్ ను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ కోర్సు ద్వారా మనిషి జ్ఞానాన్ని, ధారణాశక్తిని పెంపొందించుకోవచ్చని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం శ్రీ స్వామి శంకరానందగిరి మాట్లాడుతూ అత్యంత ప్రాచీనమైన సనాతన ధర్మంలో ఉన్న ఈ యోగ మార్గం అనేక విషయాలకు పరిష్కారాలు తెలుపుతుందన్నారు. ఇందులో క్రియాయోగము, జ్ఞాన యోగము, ప్రాణాయామము విషయాలు ఉన్నాయని చెప్పారు. ఈ యోగమార్గం నేటి సమాజానికి అత్యంత అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శ్రీ రాధేశ్యామ్, శ్రీ గోలి సుబ్రమణ్య శర్మ, శ్రీ ఫణియాజులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.