SUPRABATHA SEVA RESUMES IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 15 Jan. 21: With the conclusion of holy Dhanur masa festivities, the Suprabatha Seva resumed in Srivari temple on Friday morning.

It is well known that from December 17 onwards as part of Dhanur masa festivities Goda Thiruppavai parayanam replaced the Suprabatha Seva at the Srivari temple till January 14.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2021 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం గురు‌వారం ముగియడంతో శుక్ర‌‌వారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ శుక్ర‌‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.