SUPRABHATA SEVA RESUMES _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

TIRUMALA, 15 JANUARY 2023: After almost a month, Suprabhata Seva resumed in Tirumala temple from Sunday onwards.

With the commencement of Dhanur Masam on the evening of December 16 last, Suprabhata Seva was replaced by Tiruppavai Pasura Parayanam in Tirumala temple from  December 17 onwards.

With the completion of the holy Dhanur Masam on January 14, Suprabhata Seva resumed in Tirumala temple from January 15, Sunday onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2023 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం శనివారం ముగియడంతో ఆదివారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ సాయంత్రం నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసుర పారాయణం కొనసాగింది.

అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది .

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.