SUPRABHATHA SEVA TO RE-COMMENCE AT SRIVARI TEMPLE FROM JANUARY 15 _ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
Tirumala, 12 Jan. 20: As holy Dhanur masam comes to a ceremonious conclusion on Tuesday evening, the Suprabath seva will re-commence in Srivari temple from January 15 onwards.
It may be recalled that TTD had replaced Suprabatha seva with Andal Tiruppavai Pasura Parayanam from December 17 onwards till January 14.
TTD will conduct Goda Parinayotsavam in Srivari temple on January 16 and later in the afternoon Paruveta utsavam will be observed in Paruveta mandapam and the mock hunt festival is observed with utmost enthusiasm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల, 2020 జనవరి 12: పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియనుండడంతో బుధవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ బుధవారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.
అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.