SURPRISE VISIT BY TIRUPATI JEO_ తిరుపతి జెఈఓ ఆకస్మిక తనిఖీలు

Tirupati, 1 Mar. 19: In a surprise visit to SP Junior College and SP Polytechnic College in Tirupati on Friday evening, Tirupati JEO Sri B Lakshmikantham was surprised to notice the girl students who were deeply engaged in study hours with dedication.

During his interaction with students he was elated at their sincerity and hard work in these TTD run educational institutions.

Later he also inspected the hostel block and checked the quality of food being served to students. He also instructed the concerned to provide some protein food like multigrains or millets as evening snacks to the students so that they can study with more enthusiasm.

ISO IDENTITY TO TIRUCHANOOR

Earlier during a review meeting in his chambers’ in TTD administrative building on Friday evening he directed the officials concerned to strive hard to get ISO certification to Tiruchanoor temple, Madhava Nilayam and Srinivasa Rest Houses.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుపతి జెఈఓ ఆకస్మిక తనిఖీలు

మార్చి 01, తిరుపతి, 2019: టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం శుక్రవారం రాత్రి తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులు శ్రద్ధగా చదువుకుంటుండడాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థినులు క్రమశిక్షణతో ఎంతో కష్టపడి చదువుతున్నారని అభినందించారు.

ఆ తర్వాత హాస్టల్ బ్లాక్ ను పరిశీలించి విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు సాయంత్రం వేళ చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని స్నాక్స్ గా అందించాలని, తద్వారా మరింత ఉత్సాహంగా చదువుకోగలుగుతారని సంబంధిత అధికారులకు సూచించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపునకు కృషి

అంతకుముందు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం విశ్రాంతి గృహాలకు ఐఎస్ఓ గుర్తింపు తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేయాలని
అధికారులకు సూచించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.