SURYA GRAHANAM ON JUNE 21 _ జూన్ 21న సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం నిలుపుదల
Tirumala, 19 Jun. 20: In view of Solar eclipse on June 21, TTD authorities have dispensed with darshan for pilgrims on that day in Tirumala temple.
The eclipse will occur between 10:18am and 1:38pm.
After the closure of the temple doors with Ekanta Seva on June 20 by 8:30pm, the temple doors will be reopened on June 21 by 2:30pm and Suddhi, Punyahavachanam, Tomala, Koluvu, Panchanga Sravanam at Bangaru Vakili.
After that first Archana, first Bell, Bali, Saattumora, second Archana, second Bell will be observed in Ekantham till 6pm. Later night Kainkaryams follows from 7pm onwards and Ekanta Seva is performed at 8:30pm.
Due to solar eclipse, there will be no distribution of Annaprasadam at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex. Devotees are requested to make note of this and plan their pilgrimage accordingly.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 21న సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం నిలుపుదల
తిరుమల, 19 జూన్ 2020: జూన్ 21న సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టిటిడి కోరుతోంది.
జూన్ 21న ఆదివారం ఉదయం 10.18 గంటల నుండి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ తరువాత మూసిన శ్రీవారి ఆలయ తలుపులను జూన్ 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం మొదటి అర్చన, మొదటి గంట, బలి శాత్తుమొర, రెండో అర్చన, రెండో గంట తదితరాలను ఏకాంతంగా చేపడతారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు శుద్ధి, రాత్రి కైంకర్యాలు, రాత్రి గంట, రాత్రి 8 నుండి 8.30 గంటల ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ కైంకర్యాల కారణంగా జూన్ 21వ తేదీ నాడు పూర్తిగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదు. కల్యాణోత్సవం ఆర్జితసేవను టిటిడి రద్దు చేసింది.
గ్రహణం సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ ఉండదు. ఈ విషయాలను గుర్తించి భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి కోరుతోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.