SURYA JAYANTI IN TIRUMALA ON FEBRUARY 16 _ ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి
SRI MALAYAPPA TO BLESS DEVOTEES ON SEVEN DIFFERENT CARRIERS ON A SINGLE DAY
RADHA SAPTHAMI ALSO KNOWN AS MINI BRAHMOTSAVAMS
Tirumala, 30 January 2024: Shukla Paksha Saptami in the holy month of Magha is known as Ratha Saptami or Magha Saptami and it is believed that Sri Surya Deva starts enlightening the whole world on this auspicious day and is considered as the birthday of the deity and hence also known as Surya Jayanti. This year Radha Sapthami occurs on February 16 and Tirumala is getting ready to host the mega-religious event making elaborate arrangements to the multitude of visiting devotees.
On a single day, the processional deity of Sri Malayappa Swamy takes out a celestial ride on Seven carriers from dawn to dusk blessing the devotees. The Vahana Seva commences with the Suryaprabha Vahanam between 5:30 am and 8 am(with the first rays of Sun falling on Sri Malayappa Swamy is fixed at 6:40am), followed by Chinnasesha Vahanam between 9 am and 10 am, Garuda Vahanam between 11 am and 12noon, Hanumantha Vahanam between 1 pm and 2 pm, Chakrasnanam between 2 pm 3 pm, Kalpavruksha Vahanam between 4 pm and 5 pm, Sarvabhoopala Vahanam between 6 pm and 7 pm and Chandraprabha Vahanam between 8 pm and 9 pm.
In view of Radha Sapthami, Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepalankara Seva stands cancelled, whereas, Suprabatham, Thomala and Archana will be performed in Ekantham, as the processional deities will be paraded along the four mada streets all through the day on different carriers.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి
– ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప
తిరుమల, 2024 జనవరి 30: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహనసేవల వివరాలు :
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.