SURYAPRABHA VAHANAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM_ సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి అభయం

Tirupati 7 February 2018: As part of the Brahmotsavam of Sri Kapileswara Swamy Temple, Lord rode on Suryaprabha Vahanam on Wednesday. The vahanam went around Kapilatheertha road, Anna Rao circle, Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony, Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans and drums all along.

After Snapana tirumanjanam, abhishekham of Soma skanda murthi, Sri Kamakshi Devi was also performed with honey, curd, milk, fruit juices, and sandal paste.

CHANDRA PRABHA VAHANAM AT NIGHT

As part of the Brahmotsavam Chandraprabha vahanam will be conducted at night where Shiva in different avatar will bless the devotees.

CULTURAL PROGRAMS

The chakka bhajans, Kolata, Venkanna Godagu were performed by teams of Srimati Rajeswari, Smt K Saraswati, Smt M Bharati, Sri B Muniraju and Sri K Pachappa from Tirupati.

Among others DyEO Sri Subramanyam, AEO Sri Sankar Raju, Chief priest Sri Maniswamu, AVSo Sri Gangaraju, Supt Sri Raj Kumar, Temple inspector Sri Narayana and Sri C Muralikrishna participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి అభయం

ఫిబ్రవరి 07, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ సాగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.

అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

చంద్రప్రభ వాహనం

రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో తిరుపతికి చెందిన శ్రీమతి కె.రాజేశ్వరి బృందం, శ్రీమతి కె.సరస్వతి బృందం, శ్రీమతి ఎం.భారతి బృందం, శ్రీ బి.మునిరాజ బృందం కోలాట భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.