SV AYUR WINS MEDALS _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు పతకాల పంట
Tirupati, 7 Jan. 22: The SV Ayurvedic College students (United AP batch) received a series of medals for their extraordinary performance in academics.
TTD EO Dr KS Jawahar Reddy, JEO Veerabrahmam, Ayurvedic College Principal Dr Muralikrishna lauded the students.
The students won ten gold, silver and cash prizes in the 22nd Ayurvedic Convocation held at Tummalapalle Kalakshetra in Vijayawada.
In 23rd Convocation also the students won seven gold and silver medals along with cash awards.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు పతకాల పంట
విద్యార్థులను అభినందించిన టిటిడి ఈఓ, జెఈవో
తిరుపతి, 2022, జనవరి 07: టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ వీర బ్రహ్మం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ విద్యార్థులను అభినందించారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవ వేడుకలు ఈనెల 6వ తేదీన (గురువారం) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. 22వ స్నాతకోత్సవంలో ఆయుర్వేద వైద్య విద్యకు సంబంధించిన అన్ని(10) బంగారు, వెండి పతకాలు, నగదు బహుమతులను ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 23వ స్నాతకోత్సవంలో కూడా ప్రధానమైన 7 బంగారు పతకాలు, వెండి పతకాలు, నగదు బహుమతులను కళాశాల విద్యార్థులు సాధించారు.
22వ స్నాతకోత్సవంలో…
1. అక్షయ్ కులకర్ణి, బిఎఎంఎస్.
– కాయ చికిత్స విభాగంలో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ఆయుర్వేద భూషణ పండిత ముక్కామల వెంకటశాస్త్రి మెమోరియల్ గోల్డ్ మెడల్.
– ద్రవ్యగుణ విభాగంలో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను డాక్టర్ పేరూరు శర్మ మరియు లక్ష్మీకాంతం మెమోరియల్ గోల్డ్ మెడల్.
– కాయచికిత్స విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు పొందినందుకుగాను డాక్టర్ యం.శంకరశాస్త్రి మెమోరియల్ సిల్వర్ మెడల్.
– ప్రసూతి తంత్ర విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను డాక్టర్ యం.శంకరశాస్త్రి మెమోరియల్ సిల్వర్ మెడల్.
– సంస్కృతం మరియు పదార్థ విజ్ఞానం విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను శ్రీమతి పరిమి సీతాదేవి మరియు శ్రీ పరిమి దుర్గాప్రసాదరావు గోల్డ్ మెడల్.
2. వి. ప్రియాంక, బిఎఎంఎస్.
– రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను వైద్యవేది డాక్టర్ పిల్లా ఎల్లయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్.
– రాష్ట్ర స్థాయిలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ కి గాను డాక్టర్ అచ్యుత లక్ష్మీపతి రావు సిల్వర్ మెడల్.
3. ఇండ్లా మహేష్, బిఎఎంఎస్.
– సాలక్య విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను మరియు అన్ని సబ్జెక్టులు సింగిల్ ఆటెంప్ట్ లో ఉత్తీర్ణత పొందినందుకు గాను డాక్టర్ ముదిగొండ శరభయ్య శర్మ సిల్వర్ మెడల్.
– శల్య విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను మరియు అన్ని సబ్జెక్టులు సింగిల్ ఆటెంప్ట్ లో ఉత్తీర్ణత పొందినందుకు గాను డాక్టర్ ముదిగొండ శరభయ్య శర్మ సిల్వర్ మెడల్.
4. మేరుగు రాగమానస, బిఎఎంఎస్.
– సాలక్య విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను మరియు అన్ని సబ్జెక్టులు సింగిల్ ఆటెంప్ట్ లో ఉత్తీర్ణత పొందినందుకు గాను డాక్టర్ ముదిగొండ శరభయ్య శర్మ సిల్వర్ మెడల్.
23వ స్నాతకోత్సవంలో…
1. జఖోటియా కాంతిశ్రీ, బిఎఎంఎస్.
– రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను వైద్యవేది డాక్టర్ పిల్లా ఎల్లయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్.
– రాష్ట్ర స్థాయిలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ కి గాను డాక్టర్ అచ్యుత లక్ష్మీపతి రావు సిల్వర్ మెడల్.
2. ఎ.కావ్య, బిఎఎంఎస్.
– రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ఆయుర్వేద భూషణ పండిత ముక్కామల వెంకటశాస్త్రి మెమోరియల్ గోల్డ్ మెడల్.
– కాయచికిత్స విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను డాక్టర్ యం.శంకరశాస్త్రి మెమోరియల్ సిల్వర్ మెడల్.
3. సి. వెంకట్ చరిష్మ, బిఎఎంఎస్.
– ప్రసూతితంత్ర విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను డాక్టర్ యం.శంకరశాస్త్రి మెమోరియల్ సిల్వర్ మెడల్.
4. జి.విజయ, బిఎఎంఎస్.
– సాలక్య విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను మరియు అన్ని సబ్జెక్టులు సింగిల్ ఆటెంప్ట్ లో ఉత్తీర్ణత పొందినందుకు గాను డాక్టర్ ముదిగొండ శరభయ్య శర్మ సిల్వర్ మెడల్.
5. గుడి లలిత, బిఎఎంఎస్.
– సంస్కృతం మరియు పదార్థ విజ్ఞానం విభాగంలో ఫస్ట్ అటెంప్ట్ లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను శ్రీమతి పరిమి సీతాదేవి మరియు శ్రీ పరిమి దుర్గాప్రసాదరావు గోల్డ్ మెడల్.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.