SV BALAMANDIR STUDENTS TO BE MADE ROLE MODEL-EO / ఎస్వీ బాలమందిరం విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు
Tirupati, 6 February 2017: The hidden talents of the students of TTD-run Sri Venkateswara Balamandir school should be identified and given the best possible coaching in their academics and extracurricular activities to sculpt them as best citizens of the country, asserted TTD EO Dr D Sambasiva Rao.
The review meeting on Ttd trusts took place in the chambers of EO along with Tirumala Jeo Sri KS Sreenivasa Raju in Tirupati on Monday evening. Speaking on this occasion, the EO said, only eligible students alone should be given admission in the school and wide publicity should be given in this regard across the state.
He also instructed the concerned to make the Shravanam Project, the best deaf and dumb training institution the country by procuring state of art advanced electronic gadgets for hearing problem. He also felt the students pursuing higher education under SV Vidyadana trust should be given better training to pursue their career in future.
Later the EO also reviewed on SV Ved Parirakshana and SV Heritage preservation trusts.
All Projects special officer Sri N Muktheswara Rao, additional FACAO Sri Balaji, CAO Sri Raviprasadudu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఎస్వీ బాలమందిరం విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు
శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కింద నడుస్తున్న ఎస్వీ బాలమందిరంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా వసతులు కల్పించి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో సోమవారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో వివిధ ట్రస్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బాలమందిరంలో అర్హులకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలని, వీటికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వినికిడిలోపం చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన శ్రవణం కేంద్రాన్ని దేశంలోనే ఉత్తమ శిక్షణ సంస్థగా అభివృద్ధి చేయాలన్నారు. ఇక్కడ అవసరమైన వినికిడి పరీక్షా యంత్రాలు, బోధన పరికరాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ఎస్వీ విద్యాదాన ట్రస్టులో భాగంగా టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతికతను ఉపయోగించి ఉపాధి పొందేలా నైపుణ్యాన్ని పెంచాలన్నారు. ఈ విషయంలో నిపుణులు సహకారం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎస్వీ పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టులపైన సమీక్షించారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఆలయాలను అభివృద్ధి చేయాలని, వేదాల పరిరక్షణ, వ్యాప్తికి మరింత కృషి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఈవో సూచించారు.
ఈ సమావేశంలో తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు, ఎప్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ రవిప్రసాదు, సంబంధిత ట్రస్టుల అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.