SV HIGH SCHOOL TO BE ELEVATED TO INTERNATIONAL STANDARDS SOON-JEO(H&E)_ ఎస్వి హై స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు – జేఈఓ శ్రీమతి సదా భార్గవి

– CHILDRENS’ SKILL TO BE IDENTIFIED-DR KAMAKOTI

– SV HIGH SCHOOL CELEBRATES ITS 51st ANNIVERSARY

TIRUMALA, 24 MARCH 2023: TTD JEO for Health and Education, Smt. Sada Bhargavi asserted that the TTD’s SV High School in Tirumala will soon be elevated to International Standards in providing qualitative education.

Speaking on the occasion of the 51st anniversary of Sri Venkateswara High School at Tirumala on Friday evening, the JEO said, the school which started with just one student and a teacher, now has a strength of 25 teachers with 675 pupils.

“With a noble intention to take the school to global standards, TTD EO Sri AV Dharma Reddy mulled an innovative idea to train the students involving the country’s top most Educational Trust which has been providing the best curriculum to several thousands of students across the nation, Sri Sulochana Devi Singhania Educational Trust”, she added. 

IIT Chennai Director Professor Kamakoti who also graced the occasion, said that parents should recognize and encourage their children’s talent. Parents are advised to develop the spirit of questioning in their kids. He said that by 2047, India will become a superpower in terms of technology in the world and advised the students to study hard and climb higher peaks.

Devasthanam Education Officer Dr. Bhaskar Reddy said that students should study with discipline and perseverance to reach their desired goals.

Earlier, the Principal of the school Sri. Krishnamurthy, presented the annual report. Later, the cultural programs performed by the students allured everyone.

Vice President of Reymonds, Mr. Sanjeevi Sarin, Singhania Educational Institution Director Ms. Revathi Srinivasan, VGO Sri Bali Reddy, teachers, parents and students participated in this program.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వి హై స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు – జేఈఓ శ్రీమతి సదా భార్గవి

– పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి – డా. కామకోటి

– ఘనంగా ఎస్వీ ఉన్నత పాఠశాల 51వ వార్షికోత్సవం

తిరుమల, 2023 మార్చి 24: తిరుమల ఎస్వి హై స్కూల్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు జేఈవో శ్రీమతి సదా భార్గవి పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల 51వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, శ్రీవారి హృదయానికి దగ్గరగా ఉన్న తిరుమల ఎస్వి హై స్కూల్ ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడితో ప్రారంభమై ప్రస్తుతం 25 మంది ఉపాధ్యాయులు, 675 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నట్లు తెలిపారు. టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు స‌హ‌కారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్న‌త‌మైన విద్యాసంస్థ‌ల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతునట్లు వివరించారు.

చెన్నై ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం టెక్నాలజీ పరంగా సూపర్ పవర్ గా అవతరిస్తుందని తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.

దేవస్థానం విద్యాశాఖ అధికారి డా.భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.
సులోచ‌నా దేవి సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో టిటిడిలోని మరిన్ని విద్యాసంస్థల్లో కూడా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు.

అంతకుముందు ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ కృష్ణ‌మూర్తి, వార్షిక నివేదికను వినిపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్య‌క్రమంలో రేమండ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవి సారిన్, సింఘానియా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.