SV HIGH SCHOOL TO GET FACE LIFT-JEO(H&E) _ ఎస్వీ హైస్కూలు గ్రౌండ్ లోనే ఉద్యోగుల ఆటల పోటీలు

COMMENCES NET CRICKET

TIRUPATI, 16 OCTOBER 2022: The spacious SV High School Grounds will be given a facelift soon and set ready to organise the Employees Sports Meet also which will be held in February, said TTD JEO (H & E) Smt Sada Bhargavi.

Commencing the Net Practice and Flood Lights which were arranged in SV High School Grounds at a cost of Rs. 10lakhs, the JEO also played for a while.

Later speaking on the occasion she said, with the efforts of TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, former EO Sri KS Jawahar Reddy the Grounds has been allotted for the Employees Cricket Match.

She said the children of TTD employees will be trained in Hockey under the supervision of Kumari Rajani, International Hockey Player as well Sports Advisor to TTD.

DEO Sri Govindarajan, DyEO Welfare Smt Snehalatha and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ హైస్కూలు గ్రౌండ్ లోనే ఉద్యోగుల ఆటల పోటీలు

– నెట్ క్రికెట్ ను ప్రారంభించిన టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 16 అక్టోబరు 2022: ఎస్వీ హైస్కూలు గ్రౌండ్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఫిబ్రవరిలో జరిగే ఉద్యోగుల ఆటల పోటీలన్నీ ఇక్కడే నిర్వహిస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.

టీటీడీ ఉద్యోగులకు క్రికెట్ కోసం కేటాయించిన గ్రౌండ్ లో రూ 10 లక్షలతో ఏర్పాటు చేసిన నెట్ ప్రాక్టీస్ విభాగాన్ని, ఫ్లడ్ లైట్లను ఆదివారం ఆమె ప్రారంభించి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, మాజీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి సంపూర్ణ సహకారంతోనే ఎస్వీ హైస్కూలు గ్రౌండ్ ఉద్యోగుల క్రికెట్ ఆట కోసం కేటాయించినట్లు తెలిపారు. గ్రౌండ్ అభివృద్ధిలో భాగస్వాములైన సిఈ, డిఈవో, ఉద్యోగులు, టీటీడీ లోని క్రికెట్ క్రీడాకారులను ఆమె అభినందించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే భక్తులకు చక్కటి సేవలు అందించగలుగుతారని అన్నారు.ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళా ఉద్యోగులకు క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఫిబ్రవరిలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ క్రీడా సలహాదారు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని ద్వారా ఉద్యోగుల పిల్లలకు కూడా హాకీలో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే ఈ కార్యక్రమం సాధ్యమైందని అన్నారు. గ్రౌండ్ అభివృద్ధికి విరాళాలు అందించిన ఉద్యోగులు, క్రికెట్ అభిమానులను జేఈవో సన్మానించారు.

డిఈవో శ్రీ గోవింద రాజన్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి స్నేహలత, ఉద్యోగుల సహకార బ్యాంకు డైరెక్టర్లు శ్రీ చీర్ల కిరణ్, శ్రీమతి హేమలత తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది