SV VEDIC UNIVERSITY SHOULD SERVE AS A COORDINATING BODY TO ALL VEDIC VARSITIES ACROSS THE COUNTRY-RETD. IAS PVRK PRASAD _ వేదవాఙయం లోకకల్యాణానికి మూలం – శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌

TIRUPATI, NOV 23:  The TTD-run Sri Venkateswara Veda Viswavidyalayam should become a coordinating body of all Vedic varsities of the country and should put efforts for the spreading of Vedic knowledge in the society.

 

Addressing the conclave of Vedic students on the occasion of the three-day Youth Festival-“Veda Vidya Yuva Chatra Samaroham 2010” which commenced in Rameshwara Bhavan at the Vedic varsity in Tirupati on Tuesday, the former TTD EO in his key note address felt that there is an urgent need to bridge the gap between Vedas and society. “Majority people are of a misconception that Vedas are constrained to only a section of the community. The vedic varsity should take that responsibility of clearing this fallacy among the public. Vedas are not restricted to spiritual chanting of mantras alone. In fact the rich hidden treasure in Vedic mathematics, Vedic architecture and Vedic sciences should go to the public so that the people will develop credibility in our ancient literature”, added.

 

Further he strongly opined that the university should develop in the field applied programme also. “Use the Vedic knowledge to over come the poverty and sorrows in the field of agriculture apart from taking up wide range of research works in the university. There are systems and solutions which are mentioned in Vedas to over come any sort of crisis or calamity. If you could make use of this knowledge, then the Vedas will become an integral part in the society”, he said.

 

Later addressing the occasion, the district collector, Sri V.Seshadri who graced the function as chief guest said, that though the Vedas are considered to be 5000 years old, they are still young and fresh due to their relevance even to the modern day society. “Even today various scientific inventions and discoveries are emerging out of the Vedic knowledge. Vedas not only explores the origin of universe but also the relation between man and creator. So Vedas will long last as long as the humanity lasts and the vedic knowledge is immortal and eternal”, he maintained.

 

The Collector also felt that in spite of the fast changing times, the ancient study of Veda could be able sustain its legacy and today many Vedic universities have come across the country, which is a welcoming and healthy change. “Today in many schools we are teaching fundamentals of Vedas so that the children will be made aware of rich Vedic heritage”. He asked the Vedic Varsity to be a torch bearer of Vedic knowledge in the society.

 

Earlier the varsity VC Sri S.Sudarshana Sharma said the four-year old young university will pioneer the cause of safeguarding vedic knowledge in the country and explore new ways and means to reach the people at large.

 

The vedic students will present and perform ancient educational arts like “Shalaka”, Arohana-Avarohana, Chitralekhanam etc in the thee day festival which will conclude on Thursday.

 

On this occassion the autorites & delegates realeased youth festival logo.  Vedic University Assistant Registrar Bhat is also present at the meeting.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD

వేదవాఙయం లోకకల్యాణానికి మూలం – శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌

తిరుపతి, 2010 నవంబర్‌-23,: సమస్త మానవ జీవన వ్యవస్థలో వేదవాఙయం ముఖ్యభూమిక పోషిస్తూ లోకకల్యాణానికి మూలాధారం కావాలి అని, ఆ దిశగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము కృషి చేయాలి అంటే దేశంలోని ఇతర వేదవర్శిటీలు అన్నింటికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని విశ్రాంత ఐ.ఎ.యస్‌ అధికారి, తితిదే మాజీ కార్యనిర్వహణాధికారి అయిన శ్రీ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ తెలిపారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం మూడురోజుల వేదవిద్య యువ ఛాత్రసమారోహం-2010 (యువజనోత్సవం) తొలిసారిగా అత్యంత ఘనంగా రామేశ్వర ప్రశాసన భవనంలో ప్రారంభమయ్యింది.ఈ సందర్భంగా తమ కీలక ఉపన్యాసంలో శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ వేదవాఙయ సారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఎంతైన ఉంది అని అన్నారు.

       ఎన్నో వేల సంవత్సారాల ఘనచరిత్ర కల్గిన వేదం నేటికి కొనసాగుతుండడం ఆ విద్య యొక్క ప్రాభవానికి నిదర్శనం అన్నారు. అయితే నేటికి సమాజంలో వేదవిద్య అనేది ఏ ఒక కులానికి మాత్రమే పరిమితమైన విద్య అనే అపోహ బలంగా నాటుకొని ఉంది అని అన్నారు. ఈ అపోహను తొలగించాలి అంటే వేదవిశ్వవిద్యాలయం వారు వేదవిద్యలో నిఘూడమై ఉన్న వైజ్ఞానిక,సామాజిక,ఆర్ధిక, ఆంతరిక్ష,వ్యవసాయ, గణిత సంబంధిత శాస్త్రాలలోని అంశాలను నేటి కాలానికి ఉపయోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా చేయగల్గినప్పుడే వేదవాఙయానికి ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన నొక్కి వక్కానించారు.

అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ శ్రీ వి.శేషాద్రి మాట్లాడుతూ ఐదువేల సంవత్సరాలనాటి ప్రాచీన విద్య అయిననూ నేటికి ఈ వేద విద్య మనుగడ సాగిస్తూ వస్తూంది అంటే  అందుకు కారణం పురాతన వేద విద్యలో నేటి సమాజానికి కావలసిన అంశాలు కూడా నిఘూడమై ఉంది అని అన్నారు. ఈ విశ్వం, మానవ జాతి ఉన్నంత వరకు వేద వాఙయం సజీవంగా ఉంటుంది అని ఆయన ఉద్ఘాటించారు. ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో ప్రాచీన వేదవిద్య మనుగడకు ఒక్కింత విఘాతం కల్గిన మనదేశంలోని వేద పండితులు ఒక కుటీర పరిశ్రమల వేద విద్యను కాపాడుతూ వచ్చారు అని అన్నారు. నేడు మనదేశంలో  అనేక వేదవిశ్వ విద్యాలయాలు రూపుద్దిదుకోవడం వేదవిద్య పునరుద్ధరణకు, పునరుజ్జీవనానికి నిదర్శనం అన్నారు.రానున్న భవిష్యత్తులో వేదవిద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి ఇప్పటికే పలుపాఠశాలలలో మూలసూత్రాలను నేర్పడం జరుగుతోంది అన్నారు. వేదవిశ్వ విద్యాలయం వేదవిద్యోన్నతికి ఆచరణ కార్యక్రమంను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు.  

అంతకు పూర్వం వేదవిశ్వవిద్యాలయం కులపతి శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ వేదవాఙయ పరిరక్షణలో శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం మార్గదర్శకంగా నిలుస్తుంది అని అన్నారు.తొలిసారిగా జరుగుతున్న ఈ యునజనోత్సవంలో విద్యార్థులు సనాతన వైదిక విద్యలైన శలాక, ఆరోహణ-అవరోహణ, ప్రశ్నపుంజిక, స్వఅధ్యయన నిష్ణాత, మంత్ర అంత్యాక్షరి తదితర వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వర్శిటి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీ భట్టు, ఓ.యస్‌.డి. దేవేందర్‌ తదితర అధ్యాపక,అధ్యాపకేతర బృందం వివిద వేద వర్శిటీల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.