SARASWATHI YAGAM PERFORMED_ ఎస్వీ వేద వర్సిటీలో ఘ‌నంగా శ్రీ సరస్వతీయాగం

Tirupati, 28 January 2018: Saraswathi Yagam performed with religious fervour in SV Vedic varsity in Tirupati on Sunday on the auspicious day of Bhishma Ekadasi.

Under the supervision of Agnihotra Sri Srinivasacharyulu, the Yagam took place in Sri Mahavishnu Yagashala where in Lord in the guise of Saraswathi Devi-the Goddess of Wisdom.

After performing viswaksena puja, punyahavachanam, Saraswathi kankana puja, Kumbharadhana, Agnipratista, Saraswathi Mantram has been recited 108 times.

Students from various schools across the temple city took part in this homam. CVSO Sri A Ravikrishna, Registrar Sri Viswanatha were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ వేద వర్సిటీలో ఘ‌నంగా శ్రీ సరస్వతీయాగం

తిరుపతి, 2018 జనవరి 28: టిటిడి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సరస్వతీయాగాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. వర్సిటీ ప్రాంగణంలోని శ్రీమహావిష్ణుయాగశాలలో ఆచార్య అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. యాగ వేదిక‌పై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌భూ స‌మేత శ్రీ శ్రీ‌నివాస‌మూర్తి ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చారు.

ముందుగా విష్వ‌క్సేన‌పూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, స‌ర‌స్వ‌తి కంక‌ణ‌పూజ కుంభారాధ‌న‌, అగ్నిప్ర‌తిష్టాప‌న చేశారు. న‌గ‌రంలోని ప‌లు పాఠ‌శాల‌ల నుంచి వ‌చ్చిన విద్యార్థుల‌తో సంక‌ల్పం చేయించి స‌ర‌స్వ‌తి మూల‌మంత్రాన్ని అంద‌రితో ప‌లికించారు. ఆ త‌రువాత 108 సార్లు స‌ర‌స్వ‌తి మంత్రాన్ని జ‌పించి హోమం చేప‌ట్టారు. పూర్ణాహుతితో ఈ యాగం ముగిసింది. అనంత‌రం విద్యార్థులంద‌రికీ స‌ర‌స్వ‌తి కంక‌ణాల‌ను పంపిణీ చేశారు. 2018వ విద్యాసంవత్సరంలో పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, జ్ఞానసమృద్ధి, విజ్ఞాన వికాసం, ఉన్నతస్థితి సాధనతోపాటు అందరికీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ సంద‌ర్భంగా ఆచార్యులు ఆశీర్వ‌దించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే ర‌వికృష్ణ దంప‌తులు, రిజిస్టార్ శ్రీ విశ్వ‌నాథ‌, డీన్ శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌శ‌ర్మ‌, ఫైనాన్స్ అధికారి శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌, పిఆర్‌వో శ్రీ టి.బ్ర‌హ్మాచార్యులు, ఇత‌ర విభాగాల అధ్యాప‌కులు, వేద విద్యార్థులు, న‌గ‌రంలోని ప‌లు పాఠ‌శాల‌ల నుంచి 1500 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.