SVBC TO TELECAST YOGAVASHISTAM- SRI DHANVANTHRI MAHA MANTRA PARAYANAMS FOR WELL-BEING OF HUMANITY- TTD CHAIRMAN _ లోక‌క్షేమం కోసమే “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం ఎస్వీబీసీ లైవ్ ద్వారా భ‌క్తులు మంత్ర ప‌ఠ‌నం చేసే అవ‌కాశం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 10 Apr. 20: TTD is organising the Parayanam of Yogavashistam-Sri Dhanvanthri Maha Mantra daily for 45 minutes for the well being of entire Humanity from the onslaught of Covid-19 pandemic, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Launching the program at Nada Neerajana Mandapam on Friday morning at Tirumala, the TTD chairman Sri YV Subba Reddy speaking to media said that the program would be telecasted on SVBC channel for devotees to participate in the parayanams of Yogavashistam-Sri Dhanvanthri Maha Mantra. “Devotees across the world could chant the Maha mantra daily and get relief from Covid scare, he said.

Speaking to media later the TTD chairman said TTD had launched several Vedic initiatives to fight pandemic. “For 20 days since March 16 we have been conducting series of spiritual programmes including Sri Srinivasa Veda Mantra Arogya Japa, Shantyotsava Sahita Dhanvanthri Maha Yagam. Now under the aegis of Sri KSS Avadhani, Principal of Dharmagiri Veda Vigynana Peetham, the mantras from Yogavashistam are bring recited for destruction of micro viruses which are described in the 69th chapter of Ramayana penned by Valmiki Maharshi.

The TTD pundits also conducted the Parayanams of Durga Parameswari Stotram conceived by the pontiffs of Sringeri mutts along with Dhanvanthri Mantra.

During the Parayanam, performed on Friday, the Veda pundits initially served all devotees a sankalpam to combat the Corona virus through all means. 

Thereafter the Parayanam of five slokas from Yogavashistam rendered. Starting with Visuchika Nivarana Mantram, then followed Sri Durga Parameswari Mantram for three times, Sri Dhanwantari Maha Mantra was recited for 21 times, followed by Gayatri Mantram and concluded with Srivari Dhyana Stotram.

The program is being telecasted live on SVBC for 45minutes commencing at 7am. Everyday the programme will be there at the same time.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, Srivari Temple DyEO Sri Harindranath, SEs Sri Nageswar Rao, Sri Venkateswarulu, Estate Officer Sri Vijayasaradhi, VSO Sri Manohar, Health officer Dr RR Reddy, Deputy EOs Sri Balaji, Sri Nagaraja, Sri Damodaram and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక‌క్షేమం కోసమే “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం
 
ఎస్వీబీసీ లైవ్ ద్వారా భ‌క్తులు మంత్ర ప‌ఠ‌నం చేసే అవ‌కాశం
 
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2020 ఏప్రిల్ 10: లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం చేస్తున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం ప్రారంభ‌మైంది.

 ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వ్యాధి వ్యాప్తి అరిక‌ట్టాల‌ని స్వామివారిని కోరుకుంటూ గ‌త 20 రోజుల నుండి తిరుమ‌ల‌లో ప‌లు వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇందులో భాగంగా  మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం, మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వ‌హించామ‌ని వివ‌రించారు. “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నామ‌ని, త‌ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ఈ వేదమంత్రాల‌ను ప‌ఠించి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తిరోజూ ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లై 45 నిమిషాల పాటు కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ శ్రీ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణం గ్రంథంలోని యోగ‌వాశిస్టంలో శ్రీ‌రామ, వ‌శిష్ట సంవాదరూపమైన ఉత్ప‌త్తి ప్ర‌క‌ర‌ణంలో 69వ స‌ర్గ‌లో విషూచికా(సూక్ష్మ‌క్రిమి) నివార‌ణ మంత్రం ఉంద‌న్నారు. ఈ మంత్రంతోపాటు శృంగేరి జ‌గ‌ద్గురువులు లోకానికి అందించిన శ్రీ దుర్గాప‌ర‌మేశ్వ‌రి స్తోత్రం, మాన‌వాళికి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించి శ్రీ ధ‌న్వంత‌రి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రాన్ని పారాయ‌ణం చేసిన‌ట్టు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో వేద‌పండితులు ముందుగా క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ కోసం సంక‌ల్పం చెప్పించారు. మొద‌ట‌గా యోగ‌వాశిస్టంలోని విషూచికా(సూక్ష్మ‌క్రిమి) నివార‌ణ మంత్రాన్ని ప‌ఠించారు. ఆనంత‌రం శ్రీదుర్గాప‌ర‌మేశ్వ‌రి స్తోత్రంలోని 5 శ్లోకాల‌ను 3సార్లు, ధ‌న్వంత‌రి మ‌హామంత్రాన్ని 21 సార్లు పారాయ‌ణం చేశారు. చివ‌రిగా ధ‌న్వంత‌రి గాయత్రి మంత్రం, శ్రీ‌వారి ధ్యానంతో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది. వేద‌పండితులు పారాయ‌ణం చేస్తుండ‌గా అధికారులు, ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారంలో టివి సెట్ల ద్వారా భ‌క్తులు వారిని అనుస‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఎస్ఇలు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ విజ‌య‌సార‌థి, శ్రీ బాలాజి, శ్రీ నాగ‌రాజ‌, శ్రీ దామోద‌రం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.