SVBC UPGRADED TO ENHANCE SANATANA HINDU DHARMA PRACHARAM-TTD CHAIRMAN _ ఎస్వీ బిసి నూతన కార్యాలయం ప్రారంభం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన భవనాన్ని

INAUGURATES Rs.20Cr NEW SVBC BUILDING ALONG WITH Dy CM 

 Tirupati, 28 Sep. 20: The modernisation of Sri Venkateswara Bhakti Channel is aimed at spreading the Hindu Dharma Prachara activity across the country by enhancing the quality of programmes with advanced studio set up and gadgets, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Inaugurating the Rs.20.45crore SVBC new building at Alipiri along with Deputy Chief Minister Sri Narayanaswamy on Monday, the Chairman said, the idea of setting up an exclusive channel for TTD religious activities to wide spread Hindu Sanatana Dharma Prachara to the nook and corner of the country was mulled when late Sri Y S Rajasekhara Reddy was the Chief Minister of Andhra Pradesh in 2007 and SVBC was launched on July 7 in 2008. In the last 12 years, the Channel made its mark across the nation and with the introduction of recent Veda, Sundarakanda, Virataparva and Bhagavat Gita Parayanams in the COVID pandemic times, the channel has become a household name across the globe”, he added.

Adding further he said, there are two studios and Teleport facility in the new building with adequate infrastructure for launching Telugu,Tamil, Kannada and Hindi channels. Upon the request of devotees SVBC will be made an Advertisement free channel soon. SVBC trust has so far garnered Rs.4crore in the form of donations. Presently Kannada ,Hindi  channels are under pre-launch stage. Plans are under unveil to launch HD channel soon”, he maintained.

Additional EO and SVBC MD Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CE Sri Ramesh Reddy, CEO SVBC Sri Suresh Kumar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ బిసి నూతన కార్యాలయం ప్రారంభం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన భవనాన్ని

తిరుపతి. 28 సెప్టెంబరు 2020: టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి తో కలసి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే… సనాతన హిందూ ధర్మాన్ని,. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలనే లక్ష్యం తో టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ను ప్రారంభించింది.


– 2007 లో అప్పటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుమతితో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

– ఈ ప్రయత్నం ఫలించి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో 2008 ఏప్రిల్ 7 న ఉగాది రోజు టెస్ట్ సిగ్నల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

–. మూడు నెలల తరువాత జులై 7 న పూర్తి స్థాయి ప్రసారాలు ప్రారంభించింది.

– భక్తి చానళ్ల లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎస్వీ బిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది.

– చానల్ ప్రారంభించిన తక్కువ కాలం లోనే తిరుపతి నుంచే శాటిలైట్ కు అప్ లింక్ చేసే ఏర్పాటు చేసుకుంది.

– హిందూ ధర్మ ప్రచారంలో మరో ముందడుగు వేయాలనే ఉద్దేశంతో 2017 ఏప్రిల్ 14వ తేదీ తమిళ చానల్ ప్రారంభించింది.

– ఎస్వీ బిసి భవిష్యత్ అవసరాల కోసం 20. 45 కోట్లతో టీటీడీ కొత్తభవనాలు నిర్మించింది.

– ఈ భవనాలను ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అధికారులు, సిబ్బందికి నా శుభాకాంక్షలు.

– కొత్త భవనాల్లో 2 స్టూడియోలు, టెలీ పోర్ట్ తో పాటు సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక మీదట అన్ని విభాగాలు ఇక్కడ నుంచే పని చేస్తాయి.

– భక్తుల కోరిక మేరకు ఎస్వీ బిసి ని యాడ్ ఫ్రీ చానల్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నాము.

– ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి ఎస్వీ బిసి ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఈ ట్రస్ట్ కు ఇప్పటి దాకా దాదాపు 4 కోట్ల విరాళాలు అందాయి.

– భక్తుల కోరిక మేరకు హింది, కన్నడ చానళ్లు కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం.

– ప్రసారాల నాణ్యతను మరింత పెంచడానికి ఎస్వీ బిసి ని హెచ్ డి చానల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము.

– కోవిడ్ 19 నుంచి ప్రపంచం లోని ప్రజలందరినీ కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ప్రారంభించిన వేద పారాయణం, సుందర కాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణం కార్యక్రమాల లైవ్ ప్రసారాల ద్వారా ఎస్వీబిసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు మరింత దగ్గరైంది.

– మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కర్ణాటక సీఎం శ్రీ ఎడియూరప్ప గారు సుందర కాండ పారాయణం లో పాల్గొని పారాయణం చేశారు.

– కోవిడ్ 19 నిబంధనల వల్ల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిచాము. వీటిని కూడా ఎస్వీ బిసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మంది భక్తులకు చూపించింది. – త్వరలో ఇంగ్లీష్,హిందీ ప్రసారాలు ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈ ఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీ బిసి సి ఈ ఓ శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది