SVV IN HYDERABAD _ అక్టోబ‌రు 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

TIRUPATI, 12 SEPTEMBER 2022: Sri Venkateswara Vaibhavotsavams will be held in Hyderabad between October 11-15 in NTR Stadium with grandeur, said TTD JEO Sri Veerabrahmam.

 

Holding a virtual meeting with officials on Monday evening, the JEO asked the concerned to commence publicity activity, ten days prior to the mega religious event informing the local devotees about the significance of the Vaibhavotsavams and specific rituals on each day.

 

He asked the officials to gear up for the big fete selecting eminent persons to render religious commentaries, performing devotional music and dance to allure denizens in spiritual aura.

 

He also instructed the Engineering officials to set up a grand stage matching thr occasion. Besides he also directed that the deputation staff should traditional dress code.

 

One of the organizers of SVV, Smt Radha Harshavardan, Tirumala temple one of the chief priests Sri Venugopala Deekshitulu, SE 2 Sri Jagadeeshwar Reddy, SE Electrical Sri Venkateswarulu, GM Transport Sri Sesha Reddy, DyEOs Sri Subramanyam, Sri Gunabhushan Reddy, Garden Deputy Director Sri Srinivasulu, VGO Sri Manohar, Peishkar Sri Srihari, Annamacharya Project Director Dr Vibhishana Sharma, HDPP Project officer Smt Vijayalakshmi also participated.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

– ల‌క్ష‌లాది మందికి శ్రీ‌వారి సేవ‌లు, ఉత్స‌వాలు ద‌ర్శించే అవ‌కాశం

– 10 రోజుల ముందు నుంచే విస్తృతంగా ప్ర‌చారం

– ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్షించిన జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 సెప్టెంబ‌రు 12: తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి జ‌రిగే నిత్య‌, వార‌సేవ‌లు, ఉత్స‌వాల‌ను చూసే అవ‌కాశం ద‌క్క‌ని ల‌క్ష‌లాది మంది భ‌క్తులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల ద్వారా వీటిని చూసి త‌రించే అదృష్టం ల‌భిస్తుంద‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం చెప్పారు. ఇటీవ‌ల నెల్లూరులో నిర్వ‌హించిన వైభ‌వోత్స‌వాల్లో వేలాది మంది భ‌క్తులు పాల్గొన్నార‌ని, అక్టోబ‌రు 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వ‌హించే శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు స్వామివారి సేవ‌లు చూసి త‌రించే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు. వైభ‌వోత్స‌వాల గురించి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో 10 రోజుల ముందునుంచే ప్ర‌చార ర‌థాల ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వైభ‌వోత్స‌వాల ఏర్పాట్ల‌పై సోమ‌వారం అధికారుల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ స్టేడియంలో భ‌క్తులు సులువుగా గుర్తించ‌గ‌లిగే ప్రాంతంలో టిటిడి పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌య కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. వేదిక‌తోపాటు స్టేడియంలో శోభాయ‌మానంగా పుష్పాలంక‌ర‌ణ‌, విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉన్నందువ‌ల్ల అవ‌స‌ర‌మైన‌న్ని ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పారిశుద్ధ్యం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ, ర‌వాణా, వ‌స‌తి, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుపై ప్ర‌త్యేక‌శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. నెల్లూరు వైభవోత్స‌వాల‌ త‌ర‌హాలో పోటు, ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. భ‌క్తులు ఎండకు, వర్షానికి ఇబ్బంది ప‌డ‌కుండా జర్మన్ షెడ్డు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. భ‌క్తుల‌కు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స్టేడియంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు.

ఆహ్వాన‌ప‌త్రిక‌లు, భ‌క్తుల‌కు పాసులు అందించ‌డానికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. వేదిక మీద ఉండే సిబ్బంది, అధికారులు త‌ప్ప‌నిస‌రిగా టిటిడి డ్రెస్‌కోడ్ పాటించాల‌న్నారు. సేవ‌ల ప్రారంభానికి ముందు ప్ర‌వ‌చ‌నాలు, ఆయా సేవ‌ల విశిష్ట‌త‌ను భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు ఇప్ప‌టినుంచే త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాల ద్వారా స్వామివారి వైభ‌వాన్ని క‌ళ్ల‌కు కట్టేలా ప్ర‌ద‌ర్శించే విధంగా క‌ళాకారుల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు. స్వామివారి సేవ‌ల‌ను అద్భుతంగా వివ‌రించ‌గ‌లిగే వ్యాఖ్యాత‌ల‌ను ఎంపిక చేసుకోవాల‌ని కోరారు.

ఈ స‌మీక్ష‌లో కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీమతి రాధ హర్షవర్ధన్ , శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, విజిఓ శ్రీ మనోహర్, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, శ్రీ‌వారి ఆల‌య పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, హైద‌రాబాద్ శ్రీ‌వారి ఆల‌య ఏఈవో శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.