SWAMY PUSHKARINI RENOVATION WORKS BEGINS AT TIRUMALA _ స్వామి పుష్కరిణి మరమత్తులు ప్రారంభం – నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు

TIRUMALA, AUGUST 1:  In the wake of twin brahmotsavams of Lord Venkateswara this year which are scheduled to take place in the months of September and October, TTD has began the repair works of Swamy Pushkarini on Wednesday. These works will last till August 31 and as a result TTD has cancelled Swamy Pushkarini Harathi till the work period.
 
It is a usual custom in TTD to take up the repair and renovation works of the temple tank which is located adjacent to main shrine every year, one month prior to Brahmotsavams. As this year the brahmotsavams are scheduled for 18th September to 26th September and 15th October to 23rd October, the Water Works wing of TTD Engineering department began the repair works from Wednesday.
 
Meanwhile the temple tank has a capacity to hold one crore litres of water. As a part of the cleansing mechanism, the staffs of Water works department will pump out the entire water, take up the repair and colouring works. The temple tank will get ready with its new look by September 1.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వామి పుష్కరిణి మరమత్తులు ప్రారంభం – నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు

 తిరుమల, 2012 ఆగస్టు 1: ఈ ఏడాది తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి సెప్టెంబరు మరియు అక్టోబరు మాసాల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణి మరమత్తు పనులు బుధవారం నుండి తితిదే ప్రారంభించింది. ఈ పనులు ఆగస్టు నెలాఖరు వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే పుష్కరిణి హారతిని ఈ నెలాఖరు వరకు రద్దు చేసింది.

తిరుమల క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధమైన దర్శనీయ క్షేత్రంగా భాసిల్లుతున్న స్వామి పుష్కరిణి మరమత్తు పనులను బ్రహ్మోత్సవాలకు ఒక నెల ముందుగా చేపట్టడం తితిదే ఆనవాయితీగా పాటిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

దాదాపు కోటి లీటర్ల నీటి సామర్థ్యమున్న ఈ పుష్కరిణి మరమ్మతు పనులకు సుమారు నెల రోజులు పట్టనుంది. పుష్కరిణిలో ఉన్న పాత నీటిని యావత్తు తొలగించి కొత్త హంగులను, రంగులను, మరమ్మతు కార్యక్రమాలను ఆగస్టు 31వ తేదీ వరకు తితిదే నీటిపారుదల శాఖ సిబ్బంది నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను నీటిపారుదల శాఖ నిర్వాహక నిర్మాణాధికారి (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) శ్రీ నరసింహమూర్తి నేతృత్వంలో సిబ్బంది పనులను ప్రారంభించారు.

స్వామివారి పుష్కరిణి నూతన హంగులతో కళకళలాడుతూ సెప్టెంబరు 1వ తేదీ నుండి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనుంది.