SWAMY PUSHKARINI RENOVATION WORKS MOVING ON A FAST PACE_ తిరుమలలో ముమ్మరంగా స్వామి పుష్కరిణి మరమ్మతులు
Tirumala, 12 Aug,2017: The renovation works of Swami Pushkarini -the sacred temple tank located adjacent to Tirumala temple are going on a fast pace with the TTD water works department committed to complete the works before a month’s time.
ON AN AVERAGE 20K PILGRIMS TAKE BATH EVERY DAY
The temple tank has a capacity of one crore litres of water and on an average about 20thousand pilgrims take bath in this holy water body every day. During peak days the figure even touches 50000 also.
TEMPLE LEGEND
As per legend it is believed that Lord Venkateswara Himself bathed in this pond along with his consorts which was brought from Vaikuntham and placed here by Garuda.
There are seven wells inside swami Pushkarini which are also believed to be the holy torrents. They include Swamy Pushkarini, Rama, Gomathi, Markandeya, Saraswathy, Agni and Yama theerthams.
A dip in this highly sacred tank is considered a custom before entering the temple. A bath in the Swami Pushkarini is believed to cleanse pilgrims of their sins and bestow temporal prosperity.
CONTINUOUS RECYCLING
The water in the Swami Pushkarini is absolutely not stagnant or infected. It has a state-of-the-art recycling facility and water is treated before it gets into and recycled continuously. Ever year before annual brahmotsavams, the cleaning of Pushkarini is being taken up for a period of one month.. TTD cancels Pushkarini Harati, the entire month.
During the first ten days, the entire water is removed from the tank through pressure sand filter with the help of 35 HP pumps round the clock at a pace of 2.5lakh litres per hour. while in the next ten days and repair works are being taken. In the last ten days, the water in the tank is refilled and sets ready before annual Brahmotsavams. The PH of water is being maintained at 7.
TTD water works department is contemplating to complete the renovation of swamy Pushkar works in less than a month’s time, well in advance.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలలో ముమ్మరంగా స్వామి పుష్కరిణి మరమ్మతులు
తిరుమల, 12 ఆగస్టు 2017: తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల కంటే ముందుగానే ఈ పనులు పూర్తిచేసేందుకు టిటిడి వాటర్ వర్క్స్ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు.
రోజుకు 20 వేల మంది భక్తులు పుష్కరిణి స్నానం
శ్రీవారి పుష్కరిణికి దాదాపు కోటి లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రతిరోజూ సరాసరి 20 వేల మంది భక్తులు ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో 50 వేల మంది వరకు స్నానాలు చేస్తుంటారు.
పుష్కరిణి ప్రాశస్త్యం
గరుత్మంతుడు వైకుంఠం నుంచి స్వామి పుష్కరిణిని తీసుకొచ్చి ఇక్కడ కొలువుదీర్చాడని, సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారు తన దేవేరులతో కలిసి ఈ పుష్కరిణిలో స్నానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. స్వామి పుష్కరిణిలో భక్తులు అతిపవిత్రంగా భావించే ఏడు బావులున్నాయి. వీటిలో స్వామి పుష్కరిణితోపాటు రామ, గోమతి, మార్కండేయ, సరస్వతి, అగ్ని, యమ తీర్థాలున్నాయి. శ్రీవారి దర్శనానికి ముందు భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పుష్కరిణి స్నానంతో పాపాలు తొలగిపోయి స్వామివారి ఆశీస్సులతో సిరిసంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
నిరంతరాయంగా రీసైక్లింగ్
స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.
పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు 35 హెచ్‌పి పంపుల సాయంతో గంటకు 2.5 లక్షల లీటర్ల చొప్పున 24 గంటల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి బ్రహ్మోత్సవాల ముందుగానే పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే పుష్కరిణి మరమ్మతులు పూర్తి చేసేందుకు టిటిడి వాటర్ వర్క్స్ విభాగం ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతోంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.