SWARNA RATHAM PROCESSION HELD _ స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

TIRUPATI, 05 MAY 2023: On the second day morning as part of the ongoing annual Vasanthotsavams in Tiruchanoor, the procession of Swarna Ratham was held with utmost religious fervour on Friday.

 

The gold chariot carrying Sri Padmavathi Devi in all Her spiritual splendour was pulled by devotees all along the four mada streets.

 

TTD Chairman Sri YV Subba Reddy, DyEO Sri Govindarajan and other temple staff were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుపతి 5 మే 2023: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం స్వర్ణరథం పై ఆశీనులై భక్తులను సాక్షాత్కరించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.

భక్తులు తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది