CVSO ADOPTS SV COLLEGE FOR DEAF_ ఎస్వీ బదిర పాఠశాలను దత్తత తీసుకున్న టిటిడి సివిఎస్‌వో

Tirupati, 12 September 2017: The Chief Vigilance and Security Officer of TTD Sri A Ravikrishna, adopted Sri Venkateswara School for Deaf run by TTD near Alipiri at Tirupati.

As a part of it, the CVSO along with 150 vigilance wing officers and sleuths cleaned the entire premises of the school on Tuesday with the support of school children.

Later speaking on this occasion, the CVSO said, this school is one of the special education institutions being run by TTD for the sake of hearing impaired children. “To provide them the best infrastructure facilities, with all modern gadgets required for this children. I want to train these students in fine arts also and contemplating an action plan for the same. I have already contacted the Telugu North American Association (TANA) who readily agreed to support for the betterment of this institution”, he added.

The TANA co-ordinator Sri Mahadeva Naidu, Additional CVSO Sri Siva Kumar Reddy, Additional Health Officer Dr Sunil, VGO Smt Sada Lakshmi and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎస్వీ బదిర పాఠశాలను దత్తత తీసుకున్న టిటిడి సివిఎస్‌వో

సెప్టెంబర్‌ 12, తిరుపతి, 2017: తిరుపతిలోని అలిపిరి వద్దగల శ్రీవేంకటేశ్వర బదిర పాఠశాలను టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రవణోన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం ఉదయం టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది విజిలెన్స్‌ సిబ్బంది, బదిర పాఠశాల విద్యార్థులు, సిబ్బంది స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో చెత్త, చెదారం, పిచ్చిమొక్కలు, పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఎస్వీ బదిర పాఠశాలలో మరింత మౌళిక సదుపాయాల కల్పనకు వివిధ సేవాసంస్థలు, ఎన్‌ఆర్‌ఐల సహకారం తీసుకుంటామన్నారు. విద్యార్థులకు మరింత మెరుగ్గా వసతులు (నైపుణ్యం పెంచేలా బోధన, భోజన సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌, డ్రైనేజ్‌, భవనాల మరమ్మత్తులు) చేపడుతామన్నారు. పెయింటింగ్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ తదితర ఉపాధి నైపుణ్య రంగాలలో విద్యార్థులకు ఉన్న ప్రతిభ ఆధారంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎస్వీ బదిర పాఠశాల విద్యార్థులకు అవసరమైన అధునాతన సాంకేతిక పరికరాలను సమకూర్చుతామన్నారు. ఎస్వీ బదిర పాఠశాల విద్యార్థుల పెయింటింగ్‌ను అందరికి తెలియజేసేలా ఈ నెల 23వ తేది నుండి జరిగే బ్రహోత్సవాలలో ఓ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సమన్వయకర్త శ్రీ మహదేవనాయుడు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని తెలియజేశారు.

ఎస్వీ బదిర పాఠశాలను దత్తత తీసుకునేందుకు ఆమోదం తెల్పిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌లకు సివిఎస్‌వో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టిటిడిలోని వివిధ విభాగాల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తానా సమన్వయకర్త శ్రీ మహదేవనాయుడు, టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో శ్రీమతి సదాలక్మి, ఎవిజివోలు శ్రీ వి. సుకుమార్‌, శ్రీ గంగరాజు, హెల్త్‌ ఆఫీసర్‌ డా. సునీల్‌, బదిర కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి నళిన ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.