TABS DISTRIBUTED TO STUDENTS _ ఎస్వీ హైస్కూల్ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ

Tirupati, 26 December 2022: The Devasthanams Education Officer(DEO) Sri M Bhaskar Reddy on Monday presented Tabs to eighth-standard students of Sri Venkateshwara high school of TTD.

 

Earlier addressing a meeting presided over by school headmistress Smt J Sandhya, the DEO said the Tabs were provided on the directions of Honourable AP CM YS Jaganmohan Reddy to transform poor students into global citizens with the help of the digital form of teaching.

 

He said the tabs with Byju’s teaching content also with offline functionality are being distributed to all Eighth standard students of all TTD-aided schools.

 

He said the novel and noble idea by the Honourable CM of AP has been executed under the directives of TTD EO in the supervision of JEO (H & E) Smt Sada Bhargavi in the TTD school. He advised the students to make use of the facility to build up their academic career.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ హైస్కూల్ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ

తిరుపతి 26 డిసెంబరు 2022: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి సోమవారం ట్యాబ్ లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సంధ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఇవో శ్రీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా
8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ట్యాబులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బైజూస్ కంటెంట్ తో కూడిన ఈ ట్యాబ్ ఆఫ్ లైన్ లో కూడా పనిచేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు . ట్యాబులను టీటీడీ పరిధిలోని ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా పంపిణీ చేశామన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.