TAKE SANATANA DHARMA TO VILLAGES- JEO BHASKAR_ సనాతన ధర్మప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 24 January 2019: TTD Joint Executive Officer (Tirupati) Sri Pola Bhaskar urged the HDPP coordinators, Dharma Charyas, Srivari Sevakulu and trained Archakas to spread awareness of Sanatana Dharma to Village’s through dharmic programs.

Addressing the concluding session of the training programs at SVETA for all of them, as chief guest, the JEO said that all trained members will be roped in the dharmic program of TTD and that training programs will continue non-stop for spreading awareness among them.

He said TTD has enlarged the scope of programs to involve women and youth in a big way. Nearly 600 persons will be trained till March 31st, 2019.

The pontiff of Bhuvaneswar Peetham at Gangavaram Sri Sri Sri Kamalananda Bharati said Temples were harbingers of communal harmony and inky temples could promote peaceful and prosperity of families in society.

TTDs HDPP secretary Dr Ramana Prasad, OSD of Epic studies Acharya G Damodara Naidu, other officials Srivari Sevakulu and 130, trained archakas participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సనాతన ధర్మప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2019 జనవరి 24: ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా సనాతన ధర్మప్రచారాన్ని మరింతగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కోరారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్‌ సమన్వయకర్తలు, ధర్మాచార్యులు, శ్రీవారిసేవకులు, శిక్షణ పొందిన అర్చకులు, ధర్మప్రచార మండలి సభ్యులకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా నిరంతరాయంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శిక్షణ తీసుకున్నవారిని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌తో అనుసంధానం చేస్తామన్నారు. టిటిడి నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో యువత, మహిళలను భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించామన్నారు. 2019 మార్చి 31వ తేదీకి దాదాపు 600 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

గన్నవరంలోని భువనేశ్వర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ గ్రామాల్లో ఐక్యత తీసుకొచ్చేది దేవాలయాలని, ఆలయాలు, కుటుంబం పటిష్ఠంగా ఉన్నపుడే సమాజం పురోగతి సాధిస్తుందని అన్నారు. పూర్వజన్మ, పునర్జన్మ హిందూ సంప్రదాయంలోనే ఉన్నాయని తెలిపారు. హిందూ సమాజానికి జీవనాడి లాంటిది టిటిడి అని కొనియాడారు. గ్రామదేవతలు, కులదేవతలు, ఇలవేల్పు దేవతలు సనాతన ధర్మంలో భాగమన్నారు. కుటుంబంలోని సభ్యులంతా కలిసి ఆలయాలను సందర్శించేలా చైతన్యం తీసుకురావాలన్నారు.

ఈ కార్య్రకమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య జి.దామోదరనాయుడు, ఇతర అధికారులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ధర్మాచార్యులు, శ్రీవారిసేవకులు, శిక్షణ పొందిన అర్చకులు కలిపి 130 మంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.