TAKE STEPS TO RESOLVE COURT CASES SPEEDILY- TTD EO _ కోర్టు కేసుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి- టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

Tirumala,10 September 2022: TTD EO AV Dharma Reddy has directed officials of the TTD legal department to pursue measures to speedily resolve pending TTD cases in courts.

 

 

Addressing a review meeting with the Officials of the law department and Standing Counsels at Annamaiah Bhavan on Saturday, the TTD  EO  instructed officials to ensure filing of counters on all pending cases before October 15 and on basis of a priority attempt to resolve each case.

 

 

He wanted each HoD to submit para-wise remarks to the Law department and deliberate on how fast the cases could be resolved.

 

 

He also said that TTD legal department officials should review cases once in two months with Standing counsels which would help to find solutions to even critical cases.

 

 

He said the standing councils also prepare an action plan on the cases handed over to them.

 

 

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, TTD law Officer Sri Reddappa Reddy, Deputy DLO Sri Shyamsunder Reddy, Assistant Law officer Sri Yugandher Reddy, Senior Standing Counsel Sri S S Prasad, Smt Sindhu Kumari, Sri Prashant, Sri Sumanth, Sri Prabhakar Sharma and Sri Anup Kaushik were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోర్టు కేసుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి- టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

తిరుమల 10 సెప్టెంబరు 2022: టీటీడీ పై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు.
తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధికారులు , స్టాండింగ్ కౌన్సిల్స్ తో సమావేశమయ్యారు . ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ , అక్టోబరు 15వ తేదీ లోపు అన్ని కేసుల కౌంటర్లు దాఖలు చేయాలన్నారు . ప్రతి కేసు ప్రాధాన్యతను నిర్ణయించుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవాలని ఆయన సూచించారు . ప్రతి కేసుకు సంబంధించి విభాగాధిపతులు పూర్తి సమాచారంతో పేరావైజ్ రిమార్క్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు . ప్రతి కేసు ఎప్పటి లోగా ఎలా పరిష్కరించుకోవచ్చో చర్చించు కోవాలని ఈవో చెప్పారు . దేవస్థానం న్యాయవిభాగం అధికారులు రెండు నెలలకోసారి ష్టాండింగ్ కౌన్సిల్స్ తో సమీక్ష జరపాలని , దీనివల్ల ఎన్నో క్లిష్టమైన కేసుల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు . ప్రతి స్టాండింగ్ కౌన్సిల్ తమకు అప్పగించిన కేసుల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు .
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , దేవస్థానం న్యాయాధికారి శ్రీ రెడ్డెప్ప రెడ్డి , డిప్యూటీ డి ఎల్వో శ్రీ శ్యామ సుందర్ రెడ్డి , అసిస్టెంట్ లా ఆఫీసర్ శ్రీ యుగంధర్ రెడ్డి, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్స్ శ్రీ యెస్. యెస్. ప్రసాద్ , శ్రీ మతి సింధు కుమారి ,శ్రీ ప్రశాంత్, ,శ్రీ సుమంత్ , శ్రీ ప్రభాకర శర్మ , శ్రీ అనూప్ కౌశిక్ పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది