TAKE UP WIDE PUBLICITY ON HINDU DHARMA IN REMOTE VILLAGES-EO TO DHARMA PRACHARAKAS_ గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ప్రచారం :
Tirupati, 30 June 2018: One of the chief objectives of Tirumala Tirupati Devasthanam(TTD) is propagation of Hindu Sanatana Dharma and the prime role of Dharma Pracharakas is to take up wide publicity campaign on Hindu Dharma even in remote villages of AP, said TTD EO Sri Anil Kumar Singhal.
The Valedictory meet of the fifth training programme of Dharma Pracharakas took place at SVETA building in Tirupati on Saturday. The programme was jointly organised by Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD with Samarasatha Foundation. Both have taken up awareness of Hindu Dharma in 300 Villages in AP.
EO, who took part in the valedictory function, said, the Dharma Pracharakas should enhance the publicity campaign on Hindu Dharma in remote villages with a concrete action plan. “Form committees and take up the wide publicity”, he added.
He said, TTD has been constructing Sri Venkatswara Swamy temples in SC, ST, BC and fishermen communities. “We are also giving training in Archakatvan to the youth hailing from these remote areas so that they can render priesthood services in the temples of their respective areas. Our SVBC channel is airing an animation series on Venkatachala Mahatyam for the children. We are also sending our publications to the libraries in district head quarters as a part of Dharmic promotion activity. The Srinivasa Kalyanams should be performed in the areas where Dharma Pracharakas are located”, he opinioned.
SVETA Director Sri Chandra Sekhar Manda, HDPP Secretary Sri Ramana Prasad, All India Vidya Bharati Vice-President Sri Ramakrishna, Treasurer Sri Vishnuvu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ప్రచారం :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2018 జూన్ 30: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ధర్మ ప్రచారం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో శనివారం సాయంత్రం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో జూన్ 21 నుండి 30వ తేదీ వరకు 10 రోజులుగా నిర్వహిస్తున్న ”సమరసత సేవా ఫౌండేషన్” కు చెందిన ధర్మ ప్రచారకుల 5వ బృందం శిక్షణ ముగింపు సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ గ్రామస్థాయిలో, మండల స్థాయిలో ధర్మ ప్రచారకులు బృందాలుగా ఏర్పడి ప్రణాళిక బద్ధంగా ఇంటింటా ధర్మ ప్రచారం చేయాలన్నారు. టిటిడి ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్.సి., ఎస్.టి., బి.సి., మత్య్సకార కాలనీలు, ఏజెన్సీ ప్రాంతాలలో ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాలలోని భక్తి భావం కలిగిన యువకులకు అర్చక శిక్షణ ఇచ్చి, ఆయా ఆలయాలలో అర్చకులుగా నియమిస్తున్నట్లు తెలియచేశారు. అదేవిధంగా ఆలయాలకు విగ్రహాలు, పూజసామాగ్రి, వాయిద్యపరికరాలు అందిస్తున్నామన్నారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలలోని ధర్మ ప్రచార మండళ్ల ద్వారా టిటిడి ముద్రించిన పుస్తకాలు, గ్రంథాలను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలలో సనాతన ధర్మంపై ఆశక్తి కల్పించేందుకు యానిమేషన్ కార్యక్రమాలు రూపొందించి ఎస్వీబిసిలో ప్రసారం చేశారన్నారు. అదేవిధంగా సంస్కృతం, వేదాలు నేర్చుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దివ్యదర్శనం పథకంకు టిటిడి తన వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారకులు ఉన్న గ్రామాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రధాన పట్టణాలలో టిటిడి శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగే భారతీయత, ఉత్సవాలు, పండుగలు – పరమార్థం వంటివి తెలుసుకుని, స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సరళమైన భాషతో ధర్మ ప్రచారం చేయాలని కోరారు. అనంతరం ఈవో ధర్మ ప్రచారకుల నుండి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్, శ్వేతా డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్, విద్యా భారతి, అఖిల భారతీయ ఉపాధ్యక్షులు శ్రీ దూసి రామక్రిష్ణ, కోశాధికారి శ్రీ విష్ణువు, వివిధ మండలాలకు చెందిన ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.