తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
తిరుపతి ఫిబ్రవరి 16, 2018 టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి జేఈవో శ్రీకేఎస్.శ్రీనివాసరాజు శుక్రవారం రాత్రి తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీవరకు జరగనున్నాయి. ఇందులో ఫిబ్రవరి 23న ధ్వజారోహణం, 28న కల్యాణోత్సవం, గరుడసేవ, మార్చి ఒకటిన రథోత్సవం, మార్చి 2న పార్వేట ఉత్సవం, మార్చి 3న చక్రస్నానం, మార్చి 4న పుష్పయాగం జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, న్యాయ విభాగం ఓఎస్‌డీ శ్రీ సుబ్బానాయుడు, డిప్యూటీ ఈవో శ్రీధర్, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది