తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
తిరుపతి, 2019 ఫిబ్రవరి 25: టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన హంస వాహనసేవలో జెఈవో అవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలు మార్చి 13 నుంచి 21వ తేదీవరకు జరగనున్నాయి. ఇందులో మార్చి 13న ధ్వజారోహణం, మార్చి 18న కల్యాణోత్సవం, గరుడసేవ, మార్చి 19న రథోత్సవం, మార్చి 20న పార్వేట ఉత్సవం, మార్చి 21న చక్రస్నానం, మార్చి 22న పుష్పయాగం జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.