TASTY VADAS TO BE SERVED IN MTVAC FROM 11AM TO 10PM _ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడలు వడ్డింపు

Tirumala, 06 July 2025: The tasty and delicious  ”Vada” in Annaprasadam Menu will be henceforth served from 11am to 10pm everyday in the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) asserted the TTD Trust Board Chairman Sri BR Naidu.

Accompanied by one of the Board Member Sri Shantaram, he visited the MTVAC in Tirumala on Sunday evening and commenced Vada serving in the evening Annaprasadam menu to the devotees.

Speaking to the media later on the occasion he said, with an aim to provide tastier Annaprasadam, TTD commenced serving Vada in MTVAC from March 06 early this year. ”From today onwards, Vada will be served till the end of the day in Annaprasadam Complex. On an average nearly 70-75thousand Vadas will be served to the devotees everyday in  MTVAC, he added.

Meanwhile the mouth-watering Vada in Annaprasadam Menu is being prepared by TTD with an amalgamation of Bengal Gram, green chillies, Ginger, Curry, Coriander and Pudina leaves along with fennel seeds.

The devotees have also expressed immense pleasure over the gesture of extending serving of Vada in Annaprasadam Menu to the devotees from 11am to 10pm in MTVAC.

Annaprasadam DyEO Sri Rajendra Kumar, Catering Special Officer Sri GLN Sastry and others were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడలు వడ్డింపు

స్వయంగా వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్

తిరుమల, 2025 జూలై 06: తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను‌ ఉంచి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు పూజ నిర్వహించారు. 

ఆనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను అన్నప్రసాదం, వడ రుచిపై ఆరా తీయగా, చాలా రుచికరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడల వడ్డిస్తున్నప్పటికీ, ఆదివారం నుండి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రస్తుతం రోజుకు సుమారు 70 వేల నుండి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు. శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలిపారు. భోజనం నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు.

కాగా ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.