TREAT SRIVARI DEVOTEES WITH RESPECT- CVSO_ శ్రీవారి భక్తులతో గౌరవప్రదంగా మెలగండి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirupati,20 September 2017: TTD CVSO Sri Ake Ravikrishna today urged the private taxi drivers and taxi operators to behave properly and treat devotees of Lord Venkateswara who come for the Brahmotsavam with respect and dignity.

Addressing the Taxi operators at SVETA along with Police, RTA and vigilance officials today to observe all regulations on the ghat roads and ensure safe journey for devotees and their families coming for Brahmotsavam.

He said the private operators should spread awareness about transport of banned items to devotees and should follow traffic regulations strictly.

Tirupati Urban SP Sri Abhisekh Kumar Mohanty cautioned that violators would have to face seizure of vehicles and also criminal cases. CC Cameras have been installed all over Tirumala and the movements of taxis would be monitored, he cautioned.

TTD Additional CVSO asked the taxi operators to maintain their vehicles in good condition and ensure against any accidents on the ghat roads during Brahmotsavam. They should park vehicles only at places earmarked for them.

TTD Transport wing general manager Sri Sesha Reddy said taxi drivers were the first persons to meet devotees at Railway station and Bus stands and hence should conduct friendly with them.

TTD Traffic DSP Sri Malleswar Reddy said the taxi drivers had experience in ghat road driving and should take devotees safely up and down. He said they should not charge over 30 for kids and Rs 60 for elders.

Earlier MVI Sri Suresh Naidu explained the precautions to be taken by the drivers during ghat road driving.

Among others SPF DSP Sri Shankar Rao, AVSO Sri Ganga Raju and about 500 taxi operators participated in the meeting.


ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి భక్తులతో గౌరవప్రదంగా మెలగండి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

శ్వేతలో ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన సమావేశం

సెప్టెంబర్‌ 20, తిరుపతి, 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులతో గౌరవప్రదంగా మెలిగి, వారి తిరుమలయాత్ర ఫలప్రదమయ్యేలా ట్యాక్సీ డ్రైవర్లు సహకరించాలని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు, ఆర్‌టిఏ అధికారులు కలిసి తిరుమల, తిరుపతి ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఎస్‌వో మాట్లాడుతూ శ్రీవారి భక్తులను కుటుంబ సభ్యులుగా భావించి చక్కగా సేవలందించాలని సూచించారు. తిరుమల ఘాట్‌ రోడ్లలో నిబంధనలు పాటించి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు. డ్రైవర్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఘాట్‌ రోడ్లలో తప్పనిసరిగా వేగనియంత్రణ పాటించాలన్నారు. తిరుమల-తిరుపతి మధ్య నిర్దేశించిన సమయంలోనే వాహనాల రాకపోకలు సాగించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో కూడిన వస్త్రధారణ పాటించాలని కోరారు. తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా డ్రైవర్లు ముందుగానే భక్తులకు అవగాహన కల్పించాలని, అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీలకు సహకరించాలని సూచించారు.

తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి మాట్లాడుతూ ట్యాక్సీల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను, క్రమశిక్షణను తప్పక పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన డ్రైవర్లు, ఆపరేటర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఉన్నాయని, డ్రైవర్ల నడవడికను పరిశీలిస్తుంటామని చెప్పారు.

టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుని మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని కోరారు. తిరుమలలో నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్‌ చేయాలని సూచించారు.

టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి మాట్లాడుతూ బస్టాండు, రైల్వేస్టేషన్‌లో దిగిన భక్తులు మొదట కలుసుకునేది ట్యాక్సీల డ్రైవర్లనేనని, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. భక్తులకు చక్కగా సేవలందిస్తే శ్రీవారి ఆశీస్సులు తప్పక ఉంటాయని పేర్కొన్నారు.

తిరుమల ట్రాఫిక్‌ డిఎస్‌పి శ్రీ మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై డ్రైవర్లకు అవగాహన ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి-తిరుమల మధ్య పిల్లలకు రూ.30/-, పెద్దలకు రూ.60/- చొప్పున మాత్రమే ఛార్జీగా వసూలు చేయాలన్నారు. అంతకుముందు ఎంవిఐ శ్రీ సురేష్‌నాయుడు మాట్లాడుతూ ఘాట్‌ రోడ్లలో వాహనాల డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సమావేశంలో ఎస్‌పిఎఫ్‌ డిఎస్పీ శ్రీ శంకర్‌రావు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, 500 మందికిపైగా ట్యాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.