TEACHERS ARE ROLE MODELS TO SOCIETY-TIRUPATI JEO_ సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులే : టిటిడి జేఈవో శ్రీ పోలా భాస్కర్‌

Tirupati, 5 September 2018: By giving the nation the future citizens of the country by imparting value based education, teachers are often described and revered as role models for a healthy society, said TTD JEO Sri P Bhaskar.

Addressing the special programme organised on the occasion of Teachers’ Day in Mahati Auditorium at Tirupati on Wednesday morning, the JEO said, the life of Dr Sarvepalle Radhakrishna, aptly suits for a role model teacher. Born in an ordinary family, he became the Vice President of India by the way of his hard wirk. That is why even today his birth anniversary is observed as Teachers Day, he added.

The JEO also said, TTD has now comments Skill Development Programme for its students studying in the all TTD-run educational institutions. Apart from the academic education, this programme is aimed at training them on soft skills, personality development etc, he maintain es.

International Society for Sri Krishna Consciousness(ISKCON), Hyderabad representative Sri Gaurang Darshan Prabhu gave the instance of Bhakta Dhruva who did penance for six months at the age of five and appeased the Almighty with His unclenched devotion. The students also should reach their goals with similar dedication”, he added.

Earlier the JEO felicitated 15 retired teachers on this occasion.

The teachers, students of various TTD educational institutions took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులే : టిటిడి జేఈవో శ్రీ పోలా భాస్కర్‌

తిరుపతి, 2018 సెప్టెంబరు 05: సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని టిటిడి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌ ఉద్ఘాటించారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. సెప్టెంబరు 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని టిటిడి విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గొప్ప ఉపాధ్యాయుడు ప్రేరేపిస్తారని, ఇందుకు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితమే ఉదాహరణ అన్నారు. సర్వేపల్లి సేవలకు గుర్తింపుగా భారతరత్న బిరుదుతో ప్రభుత్వం సత్కరించిందని, భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును గురుపూజోత్సవంగా జరుపుకుంటూ విద్యారంగానికి నిరంతరం సేవలందిస్తున్న అరుదైన ఉపాధ్యాయులకు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సత్కరించుకుంటున్నామన్నారు. నేటికీ తమ శిష్యులు గొప్పవారు కావాలనే తలంపుతో బోధన చేస్తున్నందువల్లే ప్రపంచదేశాలలో భారతదేశ విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. టిటిడి విద్యాసంస్థలలో విద్యనభ్యసించే విద్యార్థులు నైతిక విలువలు, వ్యక్తిత్వం, నైపుణ్యం అలవర్చుకుని జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. సమాజంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రతిభను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలలో స్థిరపడాలని కోరారు. టిటిడి విద్యాసంస్థలలో మౌళిక సదుపాయాలకు కొరత లేదని, విద్యార్థులకు క్రమబద్ధంగా పాఠ్యాంశాలతో పాటు జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మంచి ప్రమాణాలు, విలువైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

అచలానంద ఆశ్రమానికి చెందిన శ్రీ విరజానంద స్వాములు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి శ్రీకృష్ణుని లాంటి జగద్గురువులు అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువులు తలచుకుంటే తమ శిష్యులను దేశ భవిష్యనిర్మాతలుగా తీర్చిదిద్దగలరని అన్నారు. తల్లి ఒడి, బడి, గుడి ప్రాధాన్యతను నవతరం విద్యార్థులకు గురువులు తెలియజేయాలన్నారు. విద్యార్థులకు తల్లి, తండ్రి, గురువులే మూల సారధులని తెలిపారు.

అసంతరం ముంబయికి చెందిన ఇస్కాన్‌ ప్రతినిధి శ్రీ గౌరంగ దర్శన్‌ ప్రభు మాట్లాడుతూ విద్యార్థులు తమ సీనియర్లను చూసి నేర్చుకునే భావాన్ని, జూనియర్లపై దయ, నేర్పించే గుణం అలవరచుకోవాలని, సమకాలికులతో స్నేహంగా ఉండడం నేర్చుకోవాలన్నారు. పట్టుదలతో ఐదేళ్ల ధృవుడు ఆరు నెలలు కఠోర తపస్సు చేసి భగవంతుని ఆశీస్సులు పొందారన్నారు. అదే తరహాలో పట్టుదలతో విద్యార్థులు కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సులువవుతుందన్నారు. ఈత ఆడడంలో చేప, చెట్లు ఎక్కడంలో కోతి ప్రథమస్థానంలో ఉన్నట్లే విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఏకాగ్రతతో నిరంతరం సాధన చేసి లక్ష్యానికి చేరుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సామాన్య వ్యక్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అనంతరం టిటిడి విద్యాసంస్థలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు 15 మందిని జెఈవో ఘనంగా సన్మానించారు. ముందుగా టిటిడి జెఈవో జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎస్వీ మ్యూజిక్‌ కాలేజీ విద్యార్థులచే సరస్వతి పూజ, శ్రీ సర్వేపల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది