TEAM WORK SUCCESS FOR AMMAVARI BRAHMOTSAVAMS_ సిబ్బంది సమ‌ష్టి కృషితో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్

Tiruchanoor, 22 Dec. 18: Team work by all departments lead to the success of Sri Padmavathi Ammavari Karthika Brahmotsavams, said Tirupati JEO Sri P Bhaskar.

Addressing the staffs during Karthika Brahmotsava Vana bhojanam held at Friday Gardens in Tiruchanoor on Saturday, the JEO said, the annual brahmotsavams went off in a smooth manner in spite of heavy turn out if pilgrims for Gaja Vahanam and Panchami Theertham. This was because of the team work by all departments which had attributed for the mega success of the religious event”, he added.

He asked everyone to continue to work with same spirit in future too.

Later he commenced anna prasadam by serving a few devotees as a part of Vanabhojanam. Devotees turned out in huge numbers

Earlier Snapana Tirumanjanam was performed to the utsavamurthy of Ammavaru in the Friday gardens.

CVSO Sri Gopinath Jetti, DyEOs Smt Jhansirani, Smt Malleswari, EE Sri Manoharam, SO Anna prasadam Sri Venugopal, Garden wing Dy Director Sri Srinivasulu, VGO Sri Ashok Kumar Goud and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సిబ్బంది సమ‌ష్టి కృషితో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్

తిరుపతి, 2018 డిసెంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసిన భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ‌లందించామ‌ని, అన్ని విభాగాల సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ వెల్ల‌డించారు. డిసెంబరు 4 నుండి 12వ తేదీ వరకు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో శ‌నివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోని శుక్ర‌వార‌పుతోట‌లో వనమహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులు వాహనసేవలతో పాటు సంతృప్తిక‌రంగా మూలమూర్తి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అర్చకులు సమయపాలనతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారని, మీడియా ప్రతినిధులతో పాటు భక్తులు చక్కటి సహకారం అందించారని తెలిపారు. ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, ఆరోగ్య విభాగం, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలోని శ్రీవారి సేవకులు భక్తులకు మెరుగైన సేవలందించారని కొనియాడారు. వాహ‌న‌సేవల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఆనంతరం వనమహోత్సవం నిర్వహించుకొవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగాంగా ఉద్యోగులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందించిన‌ట్టు తెలిపారు.

అంతకు ముందు ఫ్రైడే గార్డెన్‌లో ఉదయం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆనంతరం మహా నివేదన, వనమహోత్సవం, ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఇఇ శ్రీ మ‌నోహ‌ర్‌, డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, అన్నప్రసాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, క్యాట‌రింగ్ అధికారి శ్రీ దేశ‌య్య‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్లు శ్రీ ఈశ్వ‌ర‌య్య‌, శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.