TEMPLE DOORS CLOSED_ రాత్రి 9.30 గం||ల తరువాత భక్తులకు సర్వదర్శనం : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 31 January 2018: Owing to total lumar eclipse, the main doors of Tirumala temple were closed on Wednesday at 11am.

Tirumala JEO Sri KS Sreenivasa Raju participated in the closure ceremony.

The temple doors will be reopened on Wednesday night and the pilgrims will be allowed after 9:30pm onwards.

TTD has cancelled all arjitha sevas, privilege darshans, Rs.300, divya darshan tokens following the eclipse.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

రాత్రి 9.30 గం||ల తరువాత భక్తులకు సర్వదర్శనం : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2018 జనవరి 31: చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశామని, రాత్రి 9.30 గంటల తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

శ్రీవారి ఆలయ తలుపులు మూసిన అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామన్నారు. సమయాన్ని సూచించే రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినట్టు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశామన్నారు. అన్నప్రసాదాల వితరణ లేని కారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతించలేదన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.