జూలై 24న నగరి, బుగ్గలోని ఆలయాలకు పుష్పాల సరఫరాకు రీటెండర్లు
జూలై 24న నగరి, బుగ్గలోని ఆలయాలకు పుష్పాల సరఫరాకు రీటెండర్లు
తిరుపతి, 2019 జూలై 22: టిటిడికి అనుబంధంగా ఉన్న నగరిలోని శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయాలకు 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల సరఫరాకు రీటెండర్లు ఆహ్వానించడమైనది. ఈ రెండు ఆలయాలు తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం సముదాయంలో ఉన్నాయి. జూలై 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని ప్రకాశం రోడ్డులో గల పాత ఎస్వీ హైస్కూల్ భవనంలోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్ టెండర్లు తెరుస్తారు.
ఆసక్తి గలవారు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట రూ.250/- డిడి తీసి టెండరు ఫారాలు పొందొచ్చు. జూలై 24వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు డెప్యూటీ ఈవో కార్యాలయంలో టెండర్లు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.