ప్రీ-గమ్డ్ స్టిక్కర్లు స‌ర‌ఫ‌రాకు ఈ- టెండర్ ఆహ్వానం

ప్రీ-గమ్డ్ స్టిక్కర్లు స‌ర‌ఫ‌రాకు ఈ- టెండర్ ఆహ్వానం

తిరుపతి, 2019 ఆగ‌స్టు 07: టిటిడి ముద్రించే స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌కు అవ‌స‌ర‌మైన ప్రీ-గమ్డ్ స్టిక్కర్లు స‌ర‌ఫ‌రాకు ఉత్ప‌త్తి దారుల నుండి ఈ-టెండ‌ర్లు ఆహ్వానిస్తుంది. ఒక బాక్స్‌కు 2,400 స్టిక్క‌ర్లు వంతున 900 బాక్స్‌లు 12 నెల‌ల కాల‌నికి స‌ర‌ఫ‌రా చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

ఆసక్తి గలవారు ఇఎండి కింద రూ.13,950/- డిడిని టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట తీసి ఈ టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా తిరుపతిలోని స‌ప్త‌గిరి ప్ర‌ధాన సంపాద‌కులు కార్యాలయాన్ని 0877- 2264543, 2264363 నంబరులో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.