జూలై 19న అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వంటసరుకులు టెండర్‌ కమ్‌ వేలం

జూలై 19న అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వంటసరుకులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2018 జూలై 10: టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు కానుకగా సమర్పించిన వంటసరుకులకు జూలై 19వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు.

ఆలయంలో భక్తులు సమర్పించిన 2,620 కిలోల బియ్యం, 100కిలోల 650 గ్రాముల ఎండుమిరప, 383 కిలోల 900 గ్రాముల బెల్లం, 71 కిలోల 700 గ్రాముల చింతపండు, 223 కిలోల 600 గ్రాముల కందిపప్పు పోగయ్యాయి. వీటికి గాను జూలై 19న మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లు తెరుస్తారు. రూ.100/- డిడి తీసి ఆలయ కార్యాలయంలో టెండరు పత్రాలను పొందొచ్చు. టెండరులో పాల్గొనదలచిన వారు రూ.2500/- డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.